ఆఫీసులో అలా అడగొచ్చా?

ఒక నెలలో నా ప్రసూతి సెలవులు అయిపోతాయి. విధులకు తప్పక హాజరు కావాల్సిన పరిస్థితి. పాపాయి ఇంకా చిన్నదే.

Published : 26 Jul 2023 00:25 IST

ఒక నెలలో నా ప్రసూతి సెలవులు అయిపోతాయి. విధులకు తప్పక హాజరు కావాల్సిన పరిస్థితి. పాపాయి ఇంకా చిన్నదే. తనను చూసుకోవడానికి వీలుగా వేరే డిపార్ట్‌మెంట్‌కి మార్చమనిగానీ.. ప్రత్యేక సెలవులు కావాలని గానీ అడగొచ్చా? నాకున్న సౌకర్యాలేంటి?

- సౌజన్య, హైదరాబాద్‌

పాపాయిని వదిలి ఆఫీసుకి రావడం కొత్తగా అమ్మయిన వారికి చాలా కష్టమైన పని. ఎన్నో భావోద్వేగాలు సతమతం చేస్తుంటాయి. ఈ తికమకల మధ్య మునుపటిలా ఒత్తిడిని తట్టుకొంటూ ఆఫీసులో నెగ్గుకురాగలమా అన్న సందేహమూ వస్తుంది. కాబట్టి.. ‘మారితే’ అన్న ఆలోచన వచ్చుంటుంది. కానీ అది మంచి నిర్ణయమేనా.. ఆలోచించండి. పోనీ ఓ పని చేయండి. ముందు ఆఫీసులో చేరి ఉద్యోగం, పాపాయిని సమన్వయం ఎలా చేసుకోవచ్చో చూడండి. రోజు చివరినాటికి కలిగిన ఆలోచనలు.. భావోద్వేగాలు అన్నింటినీ ఓచోట రాసి పెట్టుకోండి. మీలో మీరే మదన పడొద్దు. ఇంట్లోవాళ్లు, సీనియర్లతో మాట్లాడండి. మీ పరిస్థితి చెప్పి సాయం కోరండి. వాళ్లూ ఇదే దశను దాటుంటారు కదా! అర్థం చేసుకుంటారు. తగిన సలహాలూ ఇస్తారు. తగిన సాయమూ చేస్తారు. దీన్నే పని ప్రదేశంలో ‘సిస్టర్‌హుడ్‌’గా చెబుతారు. దాన్ని ఉపయోగించుకోండి. కొన్ని వారాల తర్వాతా సాయం దొరకడం లేదు, సమన్వయం కుదరడం లేదు అనిపిస్తే అప్పుడు మీ ప్రయత్నాన్ని వివరిస్తూనే మార్చమని పైవాళ్లని అడగొచ్చు. అయితే మారినా పనిలో వందశాతం ఇస్తానన్న హామీ ఇవ్వగలగాలి. మగవాళ్లతో పోలిస్తే ‘అమ్మ’ల కెరియర్‌లో ఇబ్బందులు రావడానికి కారణమిదే. రెండు బాధ్యతలకీ సమన్యాయం చేయాలని చూస్తాం. కొన్నిసార్లు కుటుంబం కోసం పదోన్నతులు, ప్రాజెక్టులు వంటివీ వదులుకుంటాం. అలాగని కెరియర్‌లో వెనకబడ్డా అని కుంగిపోకండి. ఇంటిని నడిపే నాయకురాలిగా ఈ నిర్ణయం తీసుకున్నానని అనుకుంటే అసంతృప్తి దరిచేరదు. అదే వాస్తవం కూడా!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్