అతనంటే ప్రాణం.. కానీ..
నాతో కలిసి చదువుకున్న అబ్బాయిని ఇష్టపడుతున్నాను. ప్రస్తుతం సివిల్స్‌కి ప్రిపేర్ అవుతున్నాను. తనంటే నాకు ప్రాణం. కానీ కోచింగ్‌కు వెళ్లడం, వచ్చాక చదువుకోవడంతో తీరడం లేదు. అతనది అర్థం చేసుకోకుండా తనకు ఫోన్ చేయడం లేదు, కలవడం లేదు అని విసుక్కుంటున్నాడు.
నాతో కలిసి చదువుకున్న అబ్బాయిని ఇష్టపడుతున్నాను. ప్రస్తుతం సివిల్స్‌కి ప్రిపేర్ అవుతున్నాను. తనంటే నాకు ప్రాణం. కానీ కోచింగ్‌కు వెళ్లడం, వచ్చాక చదువుకోవడంతో తీరడం లేదు. అతనది అర్థం చేసుకోకుండా తనకు ఫోన్ చేయడం లేదు, కలవడం లేదు అని విసుక్కుంటున్నాడు.
-ఓ సోదరి
అతని ఆలోచన మీ చుట్టూనే ఉండి తనతో సమయం గడపటంలేదని బాధపడుతున్నాడు. జీవితంలో పెళ్లి చేసుకుని కుటుంబాన్ని ఏర్పరచుకోవడం, ఉద్యోగంలో స్థిరపడటం రెండూ ముఖ్యమే. సివిల్స్ ప్రయత్నంలో తీరిక లేకపోవడమే కాకుండా పరీక్ష నెగ్గాలన్న తపనతో ఆందోళన కూడా ఉంటుంది. కానీ ప్రేమ, చదువు రెంటినీ బ్యాలెన్స్ చేసుకోగలగాలి. ప్రిపరేషను, ఫోకసు ముఖ్యమైనా.. మీ బంధాన్ని శాశ్వతం చేసుకోవాలనే ఆలోచన ఉంది. కాబట్టి.. అతనికి కూడా కొంత సమయం కేటాయించాలి. అతను మిమ్మల్ని అర్థం చేసుకునేట్లుగా- ‘సివిల్స్ అంటే కష్టం కదా.. నువ్వు ఆశించినంత సమయం గడపటం సాధ్యం కాదు. కొంచెం అర్థం చేసుకో! ఈ పరీక్షలు అయిపోయాక.. మనం ఎక్కువ సమయం కలిసి గడపగలుగుతాం..’ తరహాలో వివరంగా మాట్లాడాలి. ఇందులో ఉత్తీర్ణత సాధించి ఉద్యోగం వచ్చాక.. అతను కూడా సాయం చేసి సర్దుకుపోవడం అవసరం. అందుకు తగ్గట్టుగా ఇప్పట్నుంచే అతని ఆలోచనా తీరు మారేలా చేయాలి. మీకు కెరియర్ ఎంత ముఖ్యమో, అతనితో అనుబంధం పెంచుకుని, భవిష్యత్తు కూడా ముఖ్యమేనని తెలిసేలా చేయండి. బొత్తిగా దూరం పెట్టకుండా, సమస్యను చెప్పి, సహకారం అడిగితే మార్పు వస్తుంది. ఈ స్పష్టత లేకుంటే నాతో ఉండటంలేదు, భవిష్యత్తులో ఇంకెలా ఉంటుందోనని వదిలేయొచ్చు. ఇద్దరూ కలిసి ప్లాన్ చేసుకుంటేనే దీన్ని సులువుగా దాటగలరు. లేదంటే మనస్పర్థలు వస్తాయి. దిగులు పడుతుంటే మీరూ పరీక్షలు సరిగా రాయలేరు. ప్రశాంతంగా ఉంటేనే ఉత్తీర్ణులవుతారు, అతని మనసూ గెలుచుకుంటారు. అది కాదు, పెత్తనం చేస్తున్నాడు, మీ కెరియర్ పట్ల అతనికి ఆసక్తి లేదు, ఇద్దరి ఆసక్తులు, లక్ష్యాలు భిన్నంగా ఉన్నాయనిపిస్తే మాత్రం ఈ ప్రేమ విషయంలో మనసు మార్చుకోవడం మేలు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.