కలిసి చేయాలంటే బెరుకు!

ఇప్పటివరకూ ఇంటి నుంచే పని. ఈమధ్యే ఆఫీసుకు రమ్మంటున్నారు. టీమ్‌ని నేరుగా చూడలేదు. ఫోన్‌లో మాట్లాడినా పని గురించే! ఒక్కసారిగా కలిసి చేయాలంటే బెరుకుగా ఉంది.

Published : 20 Sep 2023 01:54 IST

ఇప్పటివరకూ ఇంటి నుంచే పని. ఈమధ్యే ఆఫీసుకు రమ్మంటున్నారు. టీమ్‌ని నేరుగా చూడలేదు. ఫోన్‌లో మాట్లాడినా పని గురించే! ఒక్కసారిగా కలిసి చేయాలంటే బెరుకుగా ఉంది. ఎలా ప్రవర్తించాలో, ఏమేం గమనించుకోవాలో తెలియట్లేదు. నన్ను నేనెలా సిద్ధం చేసుకోవాలి?

- రజని, హైదరాబాద్‌

ఇంటినుంచి పనికి అలవాటుపడి.. ఆఫీసుకి రమ్మనగానే చాలామంది ఇబ్బందిగా భావిస్తున్నారు. ప్రయాణాలు, వాటి ఖర్చులు తిరిగి మొదలవుతాయని బెంగ పడుతున్నారు. కానీ.. దీంతో లాభాలే ఎక్కువ. అభిప్రాయాలు, ఆలోచనలు పంచుకునేప్పుడు జరిగే చర్చలు మరిన్ని కొత్త ఆలోచనలకు దారితీయడమే కాదు సృజనాత్మకతనూ పెంచుతాయి. ఇతరుల అనుభవాలు కెరియర్‌కి చాలా సాయపడతాయి. ముఖ్యంగా నిర్ణీత పనివేళలు ఉంటాయి. అర్ధరాత్రి వరకూ పనిచేస్తూ ఉండనక్కర్లేదు. ఇంట్లో నచ్చినట్లుగా ఉండొచ్చు. జనాల మధ్య తదేకంగా కూర్చొని చేయాలంటే విసుగొస్తుంది. కాబట్టి, ఆత్మీయుల ఫొటోలు, పచ్చని మొక్కలతో డెస్క్‌ను అందంగా తీర్చిదిద్దుకోండి. ఇక పని.. ఇంట్లో నింపాదిగా చేయడం అలవాటైతే.. ఒక్కసారిగా వేగంగా చేయలేయమన్న కంగారు ఉంటుంది. నెమ్మదిగా వేగం పెంచుకోండి పర్లేదు. చిన్న చిన్న విరామాలు తీసుకుంటూ కొత్త వాతావరణానికి అలవాటు పడండి. ఏది ముందు ఏది తర్వాత చేయాలన్న స్పష్టత వస్తే మీరే కుదురుకుంటారు. సందేహం, ఆలోచన ఏదైనా నేరుగా చర్చించండి.. కొత్త భావనా పోతుంది. అనవసర కంగారొద్దు. ఇప్పటికే చాలామంది సంస్థలకు వెళ్లడం మొదలుపెట్టారు, కుదురుకున్నారు. కాబట్టి, కంఫర్ట్‌జోన్‌ నుంచి పక్కకు వచ్చి మానసికంగా సిద్ధమైపోండి. క్రమశిక్షణే కాదు.. వేళకి తినడం లాంటి స్థిరమైన అలవాట్లు ఏర్పడతాయి. దృష్టిపెట్టాల్సిన అంశాలను కాగితంపై పెట్టుకోండి చాలు.. తేలికగా అలవాటు పడతారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్