Dear Vasundhara: రెండో పెళ్లి చేసుకోనా..

మావారు కొవిడ్‌తో చనిపోయారు. అబ్బాయిలిద్దరూ ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు. ఎప్పుడైనా ఫోన్‌లో మాట్లాడతారు. ఒంటరితనం బాధిస్తోంది. భార్యలేని మావారి స్నేహితుడు నన్ను రెండో పెళ్లి చేసుకుంటానంటున్నారు. పిల్లలు, బంధువులూ ఎలా స్పందిస్తారోనని భయమేస్తోంది. ఎటూ తేల్చుకోలేకపోతున్నా..

Updated : 02 Oct 2023 11:53 IST

మావారు కొవిడ్‌తో చనిపోయారు. అబ్బాయిలిద్దరూ ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు. ఎప్పుడైనా ఫోన్‌లో మాట్లాడతారు. ఒంటరితనం బాధిస్తోంది. భార్యలేని మావారి స్నేహితుడు నన్ను రెండో పెళ్లి చేసుకుంటానంటున్నారు. పిల్లలు, బంధువులూ ఎలా స్పందిస్తారోనని భయమేస్తోంది. ఎటూ తేల్చుకోలేకపోతున్నా..

ఓ సోదరి

మీ విషయంలో దాంపత్య జీవితం కంటే ఒంటరితనం పోగొట్టుకోవడం ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది. అతను పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పటికీ.. మీకు కూడా అతని పట్ల భరోసా, సదుద్దేశం ఉన్నదా, లేదా అనేది నిర్ధారించుకోండి. ఒకరికొకరు పెద్దతనంలో తోడుగా ఉంటారు, అతన్ని చేసుకుంటే ఆసరా లభిస్తుంది అనిపించి, అతనికేం జంజాటాలు లేవు, ఈ ఆలోచన బాగానే ఉందనిపిస్తే.. మీ పిల్లల దగ్గరకు ఈ ప్రతిపాదన తీసుకువెళ్లండి. ‘అతనిలా అడిగారు.. నాన్న చనిపోయాక నాక్కూడా ఒంటరిగా అనిపిస్తోంది’ అని విషయం దాచకుండా వారితో మాట్లాడండి. ఒప్పుకొంటే పేచీ లేదు. వాళ్లు కనుక గట్టిగా ప్రతిఘటిస్తే మాత్రం చేసుకోకపోవడమే మంచిది. వృద్ధాప్యంలో మీ గురించి శ్రద్ధ తీసుకోవాల్సింది, ఎమోషనల్‌ సపోర్ట్‌ ఇచ్చేది వాళ్లేగా మరి. పిల్లలిద్దరూ సమర్థిస్తే.. మిగతా కుటుంబసభ్యులకూ చెప్పండి. ఈ వయసులో రెండో పెళ్లి అంటే.. సమాజం, కుటుంబపరంగా అడ్డంకులు వచ్చే అవకాశాలు ఎక్కువ. పిల్లలతో బంధాన్ని వదులుకోలేరు కనుక.. అపార్థం చేసుకోకుండా మాట్లాడండి. వ్యతిరేకిస్తే.. అతనితో ఆ విషయం చెప్పి, పిల్లలతో యథావిధిగా ఆత్మీయంగా ఉండండి. మీకేవైనా సమస్యలు వచ్చినా వాళ్లు చూసుకుంటారు. పిల్లలు దూరంగా ఉన్నా సరే.. రోజూ మాట్లాడుతుండండి. బంధుమిత్రులను మీ ఇంటికి పిలవండి. వాళ్ల ఇళ్లకి మీరు వెళ్లండి. మీకు శారీరకంగా, మానసికంగా ఓపిక ఉందంటే.. సేవా, సాంస్కృతిక సంస్థల్లో చేరండి. పిల్లలకు చదువు చెప్పడం లాంటి వ్యాపకాలు కల్పించుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్