అనుమతి లేకుండా.. కంప్యూటర్‌ తెరుస్తున్నారు!

ఓరోజు ఆఫీసుకి వచ్చేసరికి సిస్టమ్‌ తెరిచి ఉంది. పొరపాటున ఆఫ్‌ చేయడం మర్చిపోయాననుకున్నా. ఇంకోసారీ అదే పరిస్థితి. ఈసారి లోపలి ఫోల్డర్లలో ఉంచిన నా ఫొటోలు డెస్క్‌టాప్‌ మీద కనిపించాయి.

Published : 22 Nov 2023 01:37 IST

ఓరోజు ఆఫీసుకి వచ్చేసరికి సిస్టమ్‌ తెరిచి ఉంది. పొరపాటున ఆఫ్‌ చేయడం మర్చిపోయాననుకున్నా. ఇంకోసారీ అదే పరిస్థితి. ఈసారి లోపలి ఫోల్డర్లలో ఉంచిన నా ఫొటోలు డెస్క్‌టాప్‌ మీద కనిపించాయి. అనుమానం వచ్చి ఆరాతీస్తే నాతో పనిచేసే వ్యక్తి తెరుస్తున్నారని చెప్పారు. అలా అనుమతి లేకుండా నా సిస్టమ్‌ తెరవడం, ఫొటోలు కాపీ చేసుకోవడం తప్పు కదా. ఈ పరిస్థితుల్లో నేనేం చేస్తే మంచిది?
ఓ సోదరి

ఈ తరహా ప్రవర్తనకు రెండు కారణాలుండొచ్చు. ఒకటి సంస్థ ఉద్యోగిపై ఇలా కన్నేసి ఉంచడం. ఇక రెండోది సహోద్యోగి పనిపై ఆరా తీయడం. చాలాసార్లు సంస్థ లేదా ఉద్యోగి రహస్య సమాచారం సంపాదించడం కోసం ఇలా చేస్తుంటారు. పోనీ ఊరికే చూశారన్నా అది మీ గోప్యతకు భంగం కలిగించినట్లే. కారణమేదైనా ఇది ఇబ్బందికర పరిస్థితి మాత్రమే కాదు నేరం కూడా. నిజానికి ఇలాంటివి జరగకుండా సంస్థ ముందే నియమావళిని రూపొందించి ఉండాలి. ఒకరి పని వివరాలు మరొకరికి చిక్కకుండా కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థనీ ఏర్పాటు చేయాలి. ముందు ఇలాంటివేమైనా ఉన్నాయేమో తెలుసుకోండి. తర్వాత.. నేరుగా వెళ్లి మీ సిస్టమ్‌ని తెరుస్తున్న వ్యక్తిని కలవండి. ప్రశ్నిస్తున్నట్లుగా కాకుండా అలా ఎందుకు చేస్తున్నారో కనుక్కోండి. అయితే తగిన ఆధారాలను సేకరించుకోకుండా వెళ్లొద్దు. అత్యవసర సమాచారం కోసం అని చెప్పినా అనుమతి లేకుండా చేయొద్దనండి. ఇంకోసారి ఇలా జరిగితే పైవాళ్ల దృష్టికి తీసుకెళతాననీ చెప్పండి. తీరు మార్చుకోకపోతే బాస్‌కి ఫిర్యాదు చేయడానికి వెనకాడొద్దు. మీరూ సిస్టమ్‌లో కొన్ని భద్రతా టూల్స్‌ని వేసుకోండి. వీటితో పాస్‌వర్డ్‌ లేకుండా ముఖ్యసమాచారం తీసుకోలేరు. ఇంకా ఫొటోలు వంటి వ్యక్తిగత సమాచారం ఆఫీసు సిస్టమ్‌ నుంచి తొలగించేయండి. భవిష్యత్తులోనూ ఉంచకపోతే మేలు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్