అందంగా కనిపించాలి అనుకుంటే..

పెళ్లి సమయంలో అందంగా కనిపించాలని బ్యూటీ ట్రీట్‌మెంట్‌ చేయించుకున్నా. అదేంటో.. తర్వాతి నుంచి ముఖంపై అవాంఛిత రోమాలు మొదలయ్యాయి.

Published : 26 Nov 2023 02:14 IST

పెళ్లి సమయంలో అందంగా కనిపించాలని బ్యూటీ ట్రీట్‌మెంట్‌ చేయించుకున్నా. అదేంటో.. తర్వాతి నుంచి ముఖంపై అవాంఛిత రోమాలు మొదలయ్యాయి. చూడ్డానికి ఎబ్బెట్టుగా ఉంది. పోగొట్టుకునే మార్గం చెప్పండి.

 - ఓ సోదరి

బ్యూటీ ట్రీట్‌మెంట్‌ వల్లే ఇలా అయ్యిందని చెప్పలేం. ఎందుకంటే అవాంఛిత రోమాలు ఒక్కసారిగా రావు. అయితే చర్మం మెరవాలని కొందరు పార్లర్‌ వాళ్లను సంప్రదించడం, స్టెరాయిడ్‌ క్రీములు వాడటం చేస్తుంటారు. వాటివల్ల కొన్నిసార్లు ఈ సమస్య వస్తుంది. పెళ్లి హడావుడి, ఒత్తిడితో హార్మోనుల్లో అసమతుల్యత ఏర్పడి ఉండొచ్చు. నెలసరి ఆలస్యం చేయడానికి వాడే మందుల ప్రభావమూ ఉంటుంది. వీటివల్ల కొద్దిగా లావు అవ్వడం, జుట్టు రాలే అవకాశమూ ఉంటుంది. కొందరిలో పైపెదవి, గడ్డం, రొమ్ము వద్దా ఈ అవాంఛిత రోమాలు కనిపిస్తాయి. మేకప్‌ సమయంలో చెంపల మీద నూగును తీసేస్తుంటారు. ఒకసారి షేవ్‌ చేస్తే అవి మరింత మందంగా వస్తుంటాయి. అలా జరిగిందేమో చెక్‌ చేసుకోండి. ప్రెగ్నెన్సీ రాకుండా ఏవైనా మందులు వాడుతున్నారా? వీటివల్లా ఈ సమస్య వస్తుంది. కురులు రాలుతున్నాయని టాపికల్‌ క్రీములు రాస్తున్నా.. టెస్టోస్టిరాన్‌ సంబంధిత మందులు వాడుతున్నా అవాంఛిత రోమాలు వస్తాయి. స్టెరాయిడ్‌ క్రీములు, గర్భనిరోధక మాత్రలు వంటివి ఏమైనా వాడుతోంటే నిపుణుల సలహాతో ఆపడం మేలు. ఈ రోమాలను పూర్తిగా తొలగించుకోవాలి అనుకుంటే లేజర్‌, ఎలక్ట్రాలిసిస్‌ చికిత్సలు ప్రయత్నించండి. ఇవి చర్మానికి ఏ హానీ కలగకుండా వెంట్రుకల కుదుళ్లను నాశనం చేస్తాయి. వీటిని కాంబినేషన్‌గా చేయించుకుంటే ఖర్చూ తగ్గుతుంది, శాశ్వత పరిష్కారమూ దొరుకుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్