తింగరిగా చెబుతుంది..

మా పాప వయసు ఏడున్నరేళ్లు. మాటలు ఆలస్యంగా వచ్చాయి. ఇప్పుడు బాగా మాట్లాడుతోంది. కానీ ఏదైనా అడిగితే తింగరిగా సమాధానం చెబుతుంది.. తనను మామూలుగా చేయడానికి ఇంట్లో ఏం సాధన చేయించాలో సలహా ఇవ్వండి. 

Updated : 29 Nov 2023 12:43 IST

మా పాప వయసు ఏడున్నరేళ్లు. మాటలు ఆలస్యంగా వచ్చాయి. ఇప్పుడు బాగా మాట్లాడుతోంది. కానీ ఏదైనా అడిగితే తింగరిగా సమాధానం చెబుతుంది.. తనను మామూలుగా చేయడానికి ఇంట్లో ఏం సాధన చేయించాలో సలహా ఇవ్వండి. 

ఓ సోదరి

పాప పుట్టినప్పటి నుంచి తన ఎదుగుదల ఎలా ఉందో మీరు తెలియజేయలేదు. మామూలుగా పిల్లలు ఏడాదికల్లా ఒకటి రెండు పదాలు పలుకుతారు. రెండేళ్లకు రెండు పదాలతోపాటు అర్థవంతంగా చెప్పగలరు. మూడో ఏడాది వచ్చేటప్పటికి మూడు పదాలతో వాక్యాలు చెప్తుంటారు. మీ పాపకు మాటలు ఆలస్యంగా వచ్చాయన్నారు. ఇప్పుడు బాగానే మాట్లాడుతోందన్నారు. అంటే తన మెదడు ఎదుగుదలలో స్పీచ్‌ డిలే అయింది. నడకగానీ, చేత్తో వస్తువులు పట్టుకోవడం, తినటం వంటివి కూడా కొంచెం ఆలస్యంగా వస్తాయి. కడుపులో ఉన్నప్పుడు ఎదుగుదల లేకపోయినా, లేదా ప్రసూతి సమయంలో బిడ్డకు సరిగా ఆక్సిజన్‌ అందకపోవడం, ఇన్‌ఫెక్షన్లు, పుట్టిన తర్వాత మెదడులో సమస్యలున్నా ఇలా జరుగుతుంది. కాబట్టి పాపకి సైకలాజికల్‌ టెస్టింగ్‌ చేయకుండా సలహాలివ్వడం కష్టం. మొదట బేస్‌లైన్‌ అసెస్‌మెంట్‌ కచ్చితంగా చేయాలి. అంటే పాప వయసుకు తగ్గట్లు మెదడు ఎదుగుదల ఉందో లేదో చూడాలి. దాన్ని ఇంటెలిజెన్స్‌ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. వారి వయసుకు తగినట్లు చేతలతో చేసే పనులు, నోటితో చెప్పే మాటలను పరీక్షిస్తారు. అది వారి ఎదుగుదల గురించి తెలియజేస్తుంది. మాటలు వచ్చినప్పటికీ, కాన్సెప్ట్‌లు అర్థం చేసుకోలేక పోతే తెలివితేటల్లో ఏమైనా వెనకబడి ఉందేమో తెలుస్తుంది. ఏకాగ్రతలోపం  అంటే ఏడీహెచ్‌డీ (హైపర్‌ యాక్టివిటీ డిజార్డర్‌) ఉందేమో కూడా చూస్తారు. పుట్టినప్పటి నుంచి ఐదేళ్ల వరకు బ్రెయిన్‌ ఎదుగుదలలో ఏదైనా లోపం ఉంటే అన్ని విషయాల్లో లోపాలొస్తాయి. కాబట్టి మీరు చైల్డ్‌ సైకియాట్రిస్ట్‌ను సంప్రదిస్తే.. పాపకి ఐక్యూ టెస్ట్‌ చేస్తారు. అలాగే లాంగ్వేజ్‌ స్కిల్స్‌నూ పరీక్షిస్తారు. అవన్నీ చూసి పాప ఏ విషయంలో వెనకబడి ఉందో అంచనా వేసి సలహాలిస్తారు. అవసరమైతే శిక్షణిస్తారు. కాబట్టి మీరు తప్పనిసరిగా నిపుణులను కలవండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్