గాయం తగ్గింది కానీ..

ఏడాది క్రితం వంట చేస్తోంటే పొట్టభాగంలో దుస్తులకు మంట అంటుకొని చర్మం కొద్దిగా కాలిపోయింది. గాయం తగ్గింది. కానీ.. ఈ మధ్య దురద ఎక్కువగా వస్తోంది. తగ్గించుకునే మార్గం చెప్పండి.

Published : 03 Dec 2023 01:44 IST

ఏడాది క్రితం వంట చేస్తోంటే పొట్టభాగంలో దుస్తులకు మంట అంటుకొని చర్మం కొద్దిగా కాలిపోయింది. గాయం తగ్గింది. కానీ.. ఈ మధ్య దురద ఎక్కువగా వస్తోంది. తగ్గించుకునే మార్గం చెప్పండి.

- ఓ సోదరి

దీన్ని పోస్ట్‌ బర్నింగ్‌ ప్రోరైటిస్‌ అంటాం. కాలిన గాయానికి ఇన్‌ఫెక్షన్లు, మచ్చ ఏర్పడటం, తర్వాత దురద లాంటివి తగ్గే క్రమంలో భాగమే. కేంద్ర నాడీవ్యవస్థ ప్రేరణతో ఇలా దురదలా అనిపిస్తుంది. కొందరిలో 3 నెలల నుంచి ఏడాదిలోగా తగ్గితే.. ఇంకొందరికి కొన్నేళ్లు పడుతుంది. గాయమేర్పడిన ప్రాంతం తిమ్మిరెక్కడం, పొడిచినట్లు అవ్వడం, స్పర్శ లేకపోవడం వంటి లక్షణాలూ కనిపిస్తాయి. ఆడవాళ్లలో ఈ సమస్య మరీ ఎక్కువ. అలాగని రుద్దితే.. కొత్తగా ఏర్పడుతున్న చర్మం పొలుసుల్లా రాలి మంట పుడుతుంది. మచ్చలానూ ఏర్పడుతుంది. కాబట్టి, దురదగా తోస్తే చల్లటి నీళ్లలో ముంచిన వస్త్రం లేదా ఐస్‌తో కాపడం పెట్టండి. చాలావరకూ ఉపశమనం ఉంటుంది. తట్టుకోలేకపోతుంటే మసాజ్‌లు, ఆక్యుపంక్చర్‌ వంటివీ కొద్దిమేర సాయపడతాయి. ఓట్‌మీల్‌తో స్నానం, తరచూ మాయిశ్చరైజర్‌ రాయడం.. ప్రొమాక్సైన్‌, హైడ్రోకార్టిసాన్‌ వంటి టాపికల్‌ లేదా మెంతాల్‌ లాంటి కూలింగ్‌ క్రీములను రాసినా సరే. కలబంద గుజ్జును తరచూ రాస్తే దీనిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు దురదను తగ్గిస్తాయి. వీటితోపాటు గోరువెచ్చని నీటితోనే స్నానం చేయాలి. అదీ పది నిమిషాలకు మించకూడదు. సువాసనల్లేని సబ్బులు, బాత్‌ లోషన్లు.. కాటన్‌, వదులు దుస్తులకే ప్రాధాన్యమివ్వండి. ఇవి చర్మానికి ఇరిటేషన్‌ కలిగించవు. ఓట్‌ మిల్క్‌ తాగినా మంచిదే. కొందరికి కాలిన చోట ఉబ్బెత్తుగా వస్తుంటాయి. అలా ఉంటే మాత్రం ఇంజెక్షన్లు అవసరమవుతాయి. ఈ జాగ్రత్తలు పాటించండి.. సమస్య తీరుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్