జుట్టు రాలుతోంది.. ఏం తినాలి?

నా వయసు 23. ఉద్యోగం చేస్తున్నా. ఈ మధ్య నా జుట్టు బాగా ఊడిపోతోంది. వైద్యులను సంప్రదిస్తే, విటమిన్‌ లోపం అన్నారు. ఆకుకూరలు, కూరగాయలు తింటున్నా.. సమస్య తీరడం లేదు. దీనికి పరిష్కారం చెప్పగలరు.

Updated : 07 Dec 2023 05:33 IST

నా వయసు 23. ఉద్యోగం చేస్తున్నా. ఈ మధ్య నా జుట్టు బాగా ఊడిపోతోంది. వైద్యులను సంప్రదిస్తే, విటమిన్‌ లోపం అన్నారు. ఆకుకూరలు, కూరగాయలు తింటున్నా.. సమస్య తీరడం లేదు. దీనికి పరిష్కారం చెప్పగలరు.

 ఓ సోదరి

సాధారణంగా జుట్టు ఊడిపోవడానికి చాలా కారణాలుంటాయి. మీరు సమతులాహారం తీసుకుంటున్నా అన్నారు. మంచిదే.. కానీ ఎంత మోతాదులో తింటున్నారో, ఎటువంటి వాటిని ఎంపిక చేసుకుంటున్నారో చెప్పలేదు. మీ శరీరానికి అవసరమయ్యే మైక్రోన్యూట్రియంట్స్‌ సరిగ్గా అందుతున్నాయా లేదో చూసుకోవాలి. ఎందుకంటే శిరోజాల ఎదుగుదలకి అవే కీలకం. మానసిక ఒత్తిడేమైనా ఉందా? శారీరక శ్రమ.. వ్యాయామం వంటివి చేస్తున్నారా..గమనించుకోవాలి. ఆకుకూరలు, కాయగూరలు ఎంత పరిమాణంలో తింటున్నారు? జాతీయ పోషకాహార సంస్థ నిర్దేశించిన నియమాల మేరకు.. రోజుకు కనీసం వంద గ్రాముల ఆకుకూరలు, 250గ్రాముల కూరగాయలు తీసుకోవాలి. దుంపలు.. క్యారెట్‌, బీట్‌రూట్‌ వంటి వాటిని విడిగా తీసుకోవాలి. బాగా పాలిష్‌ పట్టిన బియ్యాన్ని తినొద్దు. లేదంటే శరీరానికి కావాల్సిన మైక్రోన్యూట్రియంట్స్‌ ఐరన్‌, జింక్‌, విటమిన్‌ బి వంటివి సమపాళ్లలో అందవు. మాంసకృత్తులూ సరిపడా తీసుకోవాలి. ఇవి జుట్టు పెరుగుదలకు దోహదపడతాయి. మీరు శాకాహారులైతే రోజుకు కనీసం 90 గ్రాముల పప్పు దినుసులు తినాలి. 300 గ్రాముల పాల ఉత్పత్తులను తీసుకోవాలి. వీటితో పాటు మనం వాడే ధాన్యాలు యాభై శాతమైనా పొట్టుతో ఉండేట్లు చూసుకోవాలి. అవిసె, సోయా, పొద్దు తిరుగుడు,నువ్వులు వంటివి తినండి. ఒకవేళ మీకు మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటే శారీరక శ్రమను మరింత పెంచండి. ఇవన్నీ చేసినా సమస్య పరిష్కారం కాలేదంటే.. రక్త పరీక్షలు చేయించుకొని హార్మోన్లలో హెచ్చుతగ్గులున్నాయేమో చెక్‌ చేయించుకోండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్