పాదాలపైనే... ఎందుకలా?

పాదాలకు విపరీతమైన ట్యాన్‌. శరీరంపై మాత్రం ఇంకెక్కడా కనిపించదు. ఎందుకలా? చెప్పుల డిజైన్లో అక్కడక్కడా నల్లగా, తెల్లగా చూడటానికి చిరాగ్గా ఉంది. పోవడానికి ఏం చేయాలి?

Updated : 11 Feb 2024 03:40 IST

పాదాలకు విపరీతమైన ట్యాన్‌. శరీరంపై మాత్రం ఇంకెక్కడా కనిపించదు. ఎందుకలా? చెప్పుల డిజైన్లో అక్కడక్కడా నల్లగా, తెల్లగా చూడటానికి చిరాగ్గా ఉంది. పోవడానికి ఏం చేయాలి?

 ఓ సోదరి

న భారతీయుల్లో ఈ సమస్య ఎక్కువ. కొందరిలో నుదురు, నోటి చుట్టూ, చేతులు ముదురు వర్ణంలో మిగతా శరీరం లేత వర్ణంలో కనిపిస్తుంది. మనం ఎక్కువగా ఎండలో తిరుగుతుంటాం. పైగా సన్‌స్క్రీన్‌ లోషన్‌, ఎండ నుంచి రక్షణగా స్కార్ఫ్‌లు, టోపీలు వగైరా వాడటం లాంటివి తక్కువ. కాబట్టే, ఈ సమస్య. ఈతరం వాళ్లు ఎండ నుంచి రక్షణపై కాస్త దృష్టిపెట్టినా అదీ ముఖం వరకే. కాళ్లను పట్టించుకోరు. షూ వేసుకునే వాళ్ల పరిస్థితి నయం. కాళ్లు పాడవ్వవు. చెప్పులు వేసుకునేవారిలోనే ఇలా చర్మం భిన్నరంగుల్లో కనిపిస్తుంది. కాబట్టి, పాదాలకీ మాయిశ్చరైజర్‌, సన్‌స్క్రీన్‌ లోషన్‌ తప్పనిసరి చేసుకోండి. ఇంకా షూ వాడండి. వాటితో ఇబ్బంది అనుకుంటే టో ఫ్రీ సాక్సులు దొరుకుతున్నాయి. అవైతే ఏ చెప్పులకైనా సౌకర్యంగా ఉంటాయి. మీకు ఇప్పటికే సమస్య మొదలైంది. కాబట్టి, పగలు విటమిన్‌ సి, కోజిక్‌ యాసిడ్‌ ఉన్నవీ, రాత్రి రెటినాల్‌, గ్లైకాలిక్‌ యాసిడ్‌ క్రీములను వాడితే నయం. మరీ దారుణంగా ఉంటే కెమికల్‌ పీల్స్‌, లేజర్‌నీ ప్రయత్నించవచ్చు. ఇంకా... బొప్పాయి గుజ్జులో తేనె కలిపి, శుభ్రం చేసిన పాదాలకు పట్టించాలి. మిగలపండిన అరటి గుజ్జులో తేనె, నిమ్మరసం కలిపి రాయొచ్చు. టొమాటో గుజ్జులో పెరుగు, ఓట్‌మీల్‌ పౌడర్‌ కలిపి పాదాలకు రాసి, మృదువుగా రుద్దాలి. శనగపిండిలో ఆలివ్‌ ఆయిల్‌, చిటికెడు పసుపు, నిమ్మరసం, తగినంత గులాబీ నీరు కలిపి పూత వేయొచ్చు. నిమ్మరసంలో తేనె కలిపి లేదా నేరుగా బంగాళదుంప రసాన్ని రాసినా మంచిదే. వీటిలో నచ్చినదాన్ని ప్రయత్నించండి. పావుగంట సేపు ఉంచి, చల్లని నీటితో కడిగేస్తే సరిపోతుంది. ఈ ప్యాక్‌లను వారంలో మూడుసార్లు తప్పక వేస్తేనే ట్యాన్‌ తగ్గుముఖం పడుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్