సంపాదిస్తున్నా... నిరుత్సాహమే!

మంచి ఉద్యోగం. జీతం కూడా బాగానే ఉంటుంది. కానీ పిల్లల ఫీజు, ఇంటి ఈఎంఐ, ఇతర అవసరాలకే సరిపోతోంది. నా గురించి ఆలోచించుకునే వీలే ఉండట్లేదు. ఇంత కష్టపడుతున్నా, సంపాదిస్తున్నా నిరుత్సాహంగా అనిపిస్తోంది.

Updated : 14 Feb 2024 04:25 IST

మంచి ఉద్యోగం. జీతం కూడా బాగానే ఉంటుంది. కానీ పిల్లల ఫీజు, ఇంటి ఈఎంఐ, ఇతర అవసరాలకే సరిపోతోంది. నా గురించి ఆలోచించుకునే వీలే ఉండట్లేదు. ఇంత కష్టపడుతున్నా, సంపాదిస్తున్నా నిరుత్సాహంగా అనిపిస్తోంది. ఏదైనా సలహా ఇవ్వండి.

ఓ సోదరి

మనలో చాలామంది ఎదుర్కొనే సమస్యే ఇది. అవసరాలకు తగ్గ సంపాదన ఉంటే హాయిగా జీవిస్తున్నాం అనిపిస్తుంది. అలాకాకపోతేనే సమస్యలు! ఉదాహరణకు రూ.100 ఉంటే రూ.50 ఖర్చయితే సమస్య లేదు. వచ్చే డబ్బులకు మించి ఖర్చు చేస్తుంటేనే తలనొప్పి. ఈఎంఐల వలలో ఈతరం చిక్కుకుంటూ ఉండటానికీ ఈ తీరే కారణం. కాబట్టి, పాత పద్ధతి అనిపించినా ‘కూడబెట్టి కొనుక్కోవ’డానికి ప్రాధాన్యమివ్వాలి. దానిలోనూ ‘అవసరం’, ‘కావాలి అనిపించడం’ల మధ్య తేడాలు గమనించుకోవాలి. వీటి మధ్య సరైన సమన్వయం చేసుకుంటే ఏ ఇబ్బందీ ఉండదు. సంపాదన మన జీవనశైలిని నిర్ణయిస్తుందన్న మాట వాస్తవమే. కానీ భవిష్యత్తు అవసరాలకూ సిద్ధంగా ఉన్నప్పుడే ఆర్థిక ప్రణాళికలో విజయం సాధించినట్టు. అది సాధ్యం కావడంలో 50-20-30 సిద్ధాంతం మీకు సాయపడుతుంది.

  • అవసరాలు... నిత్యావసరాలు, ఫీజు వగైరా వాటికి జీతంలో 50% కేటాయించాలి. ఈ మొత్తం సరిపోదు ఇంకా పెంచాలి అనిపిస్తే ‘కావాలి’ అనిపించే వాటిలో కోత పెట్టాలి. ఉదాహరణకు ప్రతివారం సినిమాకి వెళ్లే అలవాటు ఉంటే నెలకోసారికి మార్చుకోవడం, క్యాబ్‌ బదులు బస్సులో వెళ్లడం వగైరా అన్నమాట.
  • కావాల్సినవి... బయట తినడం, సినిమాలు వగైరా అన్నీ వీటికిందకి వస్తాయి. వీటికి 20% డబ్బు వెచ్చించాలి.
  • పొదుపు... దీనికి 30% పక్కన పెట్టాలి. మూడు నెలల అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకున్నాక ఫండ్లు, రిటైర్‌మెంట్‌ ప్లాన్‌లు వంటివి చేసుకోవాలి. ఆర్థిక భద్రత కలగాలంటే తగ్గ ప్రణాళిక ఉండాలి. ముందు అది సాధించండి. ఇక ఆడవాళ్లు ఇంటి బాధ్యతల్లో పడి, తమ గురించి ఆలోచించడం మర్చిపోతారు. కావాల్సిన వాటి జాబితాలో మీకు నచ్చినవి తప్పక ఉండేలా చూసుకోండి. అప్పుడు అసంతృప్తీ తగ్గుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్