సమస్య... కీబోర్డు వల్లేనా?

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిని. మోచేతుల దగ్గర నల్లగా కాయల్లా వస్తున్నాయి. కీబోర్డు మీద ఎక్కువగా పనిచేయడం వల్లే ఇలా అవుతోంది అంటున్నారు.

Updated : 18 Feb 2024 06:04 IST

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిని. మోచేతుల దగ్గర నల్లగా కాయల్లా వస్తున్నాయి. కీబోర్డు మీద ఎక్కువగా పనిచేయడం వల్లే ఇలా అవుతోంది అంటున్నారు. నిజమేనా? పోగొట్టుకోవడానికి ఏం చేయాలి?

ఓ సోదరి

ఎండ, మెలనిన్‌ పెరగడం, అంతకుముందు గాయమై ఇన్‌ఫ్లమేషన్‌ ఏర్పడీ మోచేతులు నల్లగా మారతాయి. కీబోర్డు మీద పనిచేసేవారు మోచేతులపై ఎక్కువ ఒత్తిడి పెడుతుంటారు. దాంతో చర్మం రాపిడికి గురై నెమ్మదిగా నలుపుదనం కాస్తా కాయలుగా మారుతుంటాయి. ముందు అలా జరగకుండా మార్గాలను వెతుక్కోండి. అప్పుడు క్రీములు లాంటివి వాడినా ప్రయోజనం ఉంటుంది. పొడిచర్మం, ఎగ్జిమా, సొరియాసిస్‌ వంటివి ఉంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. సాల్సిలిక్‌, లాక్టిక్‌, గ్లైకాలిక్‌, మాండోలిక్‌ యాసిడ్‌లు, రెటినాయిడ్లున్న మాయిశ్చరైజర్లు వాడండి. ఇంకా కలబంద గుజ్జును రోజుకు రెండుసార్లు రాయొచ్చు. బేకింగ్‌ సోడాలో తగినన్ని నీళ్లు కానీ నిమ్మ లేదా నారింజ రసాన్ని గానీ కలిపి మోచేతులకు పట్టించాలి. ఓట్‌మీల్‌ లేదా బాదం పొడిలో తగినంత పెరుగు కలిపి రాసినా మంచిదే. చక్కెరకు తగినంత నీళ్లు కలిపి, మృదువుగా రుద్దొచ్చు. వీటిలో నచ్చినదాన్ని ఓ పదినిమిషాలు ఉంచి, కడిగేస్తే అక్కడి చర్మం ఎక్స్‌ఫోలియేట్‌ అవుతుంది. వారానికోసారి తప్పక చేయాలి. స్క్రబ్‌ తర్వాత, రోజూ ఉదయాన్నే గుర్తుంచుకొని మాయిశ్చరైజర్‌, సన్‌స్క్రీన్‌ తప్పక రాయాలి. వీటితో దాదాపుగా ఫలితం కనిపిస్తుంది. ఇవీ పనిచేయలేదు అనిపిస్తే వైద్యులను సంప్రదించండి. మెడికేటెడ్‌ క్రీములు, కెమికల్‌ పీల్స్‌ వగైరా సూచిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్