వెళ్లనా... ఆగనా?

బీటెక్‌ చేశాను. విదేశాల్లో ఉన్నతవిద్య పూర్తిచేయాలని కల. అనుభవం వస్తుంది, అమ్మానాన్నలపై ఆధారపడకుండా ఉండొచ్చని తాత్కాలికంగా ఉద్యోగం చేద్దామనుకున్నా. మంచి సంస్థలో అవకాశమూ వచ్చింది. సమస్యల్లా వాళ్లు బాండ్‌ రాయమంటున్నారు.

Updated : 27 Mar 2024 08:04 IST

బీటెక్‌ చేశాను. విదేశాల్లో ఉన్నతవిద్య పూర్తిచేయాలని కల. అనుభవం వస్తుంది, అమ్మానాన్నలపై ఆధారపడకుండా ఉండొచ్చని తాత్కాలికంగా ఉద్యోగం చేద్దామనుకున్నా. మంచి సంస్థలో అవకాశమూ వచ్చింది. సమస్యల్లా వాళ్లు బాండ్‌ రాయమంటున్నారు. అదీ మూడేళ్లు. నేనేమో ఏడాది తర్వాత విదేశాలకు వెళ్లాలని! పోనీ వేరేది వెతుక్కుందామంటే ఇదేమో మంచి సంస్థ. మూడేళ్లు ఆగుదామంటే ఈలోగా పెళ్లి అంటారని భయం. ఇప్పుడు నా ముందున్న దారేంటి?

ఓ సోదరి

‘అన్నీ మనం అనుకున్నట్లుగా సాగవు’... ముందు ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా ఒకటి కావాలి అంటే మరొకటి వదులుకోవడం, కొన్ని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి రావడం సహజం. చాలావరకూ సంస్థలు తమ ఉద్యోగులను బాండ్‌ రాయమంటాయి. ఏడాది, రెండు, మూడేళ్లు... ఇలా ఒక్కో కంపెనీలో ఒక్కోలా ఉంటుంది. ఏదేమైనా కొంత కాలంపాటు సంస్థలో ఉంచడానికి చేసే ప్రయత్నమే ఇది. కాబట్టి, సంస్థ దాన్ని సడలించే అవకాశం ఉండదు. మీకు ఆ సంస్థలో పనిచేయడం లాభిస్తుంది అనుకుంటే బాండ్‌ రాయాల్సిందే. లేదూ ఏడాదికి మించి చేయలేను, ఉన్నత చదువులే లక్ష్యం అనుకుంటే... ఈ ఉద్యోగాన్ని పక్కన పెట్టేయక తప్పదు. బదులుగా ఇంకేదైనా సంస్థకు ప్రయత్నించాలి. అక్కడా బాండ్‌ ఉండదని చెప్పలేము. ఏదేమైనా ఒకసారి మీ పరిస్థితి గురించి మానవ వనరుల విభాగంతో క్షుణ్ణంగా మాట్లాడండి. మీ సందేహాలను నివృత్తి చేసుకొని, మీకు తగినదేదో నిర్ణయించుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్