చెమట... భయం!

ఎండాకాలం అంటే చాలు భయమేస్తుంది. పాదాలకు విపరీతమైన చెమట. కాలేజీలో కొద్దిసేపు షూ విప్పాలన్నా దుర్వాసన వచ్చేస్తుంది. అలాగే ఉండాలంటే చిరాకు.

Published : 31 Mar 2024 01:35 IST

ఎండాకాలం అంటే చాలు భయమేస్తుంది. పాదాలకు విపరీతమైన చెమట. కాలేజీలో కొద్దిసేపు షూ విప్పాలన్నా దుర్వాసన వచ్చేస్తుంది. అలాగే ఉండాలంటే చిరాకు. దీనికి పరిష్కారం ఉందా?

ఓ సోదరి

చెమటతో చిరాకు అనుకుంటాం కానీ... ఇది మన శరీరాన్ని చల్లబరిచే సాధనం. కొందరిలో స్వేదగ్రంథులు అతిగా పనిచేస్తాయి. దీంతో అతి చెమట, దుర్వాసన సమస్యలు. చేతులు, పాదాలు, బాహుమూలల్లో ఎక్కువగా చెమట వస్తుంటే ‘ప్రైమరీ ఫోకల్‌ హైడ్రాలిసిస్‌’ అంటారు. విపరీతమైన చెమట బ్యాక్టీరియా, ఫంగస్‌ పెరగడానికి కారణమవుతుంది. ఫలితమే దుర్వాసన. కొన్నిసార్లు ఇన్‌ఫెక్షన్లకూ దారితీస్తాయి. దీన్ని అడ్డుకునేందుకు క్రీములు, లోషన్లు, జెల్‌, స్ప్రే... ఇలా భిన్నరకాల్లో యాంటీ పర్‌స్ప్రెంట్‌లు దొరుకుతాయి. నచ్చినదాన్ని ఎంచుకొని, రాత్రి పాదాలను శుభ్రం చేసి, తడిలేకుండా తుడిచాక రాయాలి. యాంటో ఫోరోసిస్‌... ఇది ఒక పాత్రలా ఉంటుంది. దీన్ని నీటితో నింపి, పాదాలను ఉంచాలి. దీనిలో చాలా కొద్దిపరిమాణంలో కరెంటు సరఫరా అయ్యి స్వేదగ్రంథులపై ప్రభావం చూపుతుంది. దీన్ని రోజుమార్చి రోజు ప్రయత్నించొచ్చు. నిపుణుల ఆధ్వర్యంలో ప్రయత్నించాక తరవాత ఇంట్లోనే చేసుకోవచ్చు. అయితే ఇవి తాత్కాలిక పరిష్కారాలు. దీర్ఘకాల ప్రయోజనం కావాలంటే బొటాక్స్‌ చేయించుకోవాలి. ఫలితం 6-8 నెలలు ఉంటుంది. కాస్త ఖరీదూ ఎక్కువే. కొన్నిరకాల మందులూ ఉన్నా సైడ్‌ఎఫెక్ట్స్‌ ఉంటాయని సిఫారసు చేయం. షూ, సాక్సులను తరచూ శుభ్రం చేసుకోవడం, ధరించే ముందు పొడిగా తుడుచుకుని, పౌడర్‌ వేసుకోవడం వల్ల దుర్వాసన కాస్త తగ్గుతుంది. రాత్రిపూట యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌ రాసుకోవచ్చు. బేకింగ్‌ సోడాకి తగినంత నీరు, ఎసెన్షియల్‌ ఆయిల్‌ కలిపిన మిశ్రమాన్ని కానీ, బేకింగ్‌ సోడాలో నిమ్మరసం కలిపి రాసి, పదినిమిషాలయ్యాక శుభ్రం చేసినా కొంత ఉపశమనం కలుగుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్