మా పాపకు పిరియడ్స్ లేటవుతున్నాయి.. ఎందుకిలా?

హాయ్‌ డాక్టర్‌. మా పాప వయసు 18 ఏళ్లు. తనకు మూడు నెలలకోసారి నెలసరి వస్తోంది. బ్లీడింగ్‌ నార్మల్‌గానే అవుతున్నా కనీసం పది రోజుల పాటు అవుతుంది. ఇదేమైనా సమస్యా? తనకూ అందరిలా నెలసరి రెగ్యులర్‌ కావాలంటే ఏం చేయాలో చెప్పండి.

Updated : 14 Jun 2021 19:10 IST

హాయ్‌ డాక్టర్‌. మా పాప వయసు 18 ఏళ్లు. తనకు మూడు నెలలకోసారి నెలసరి వస్తోంది. బ్లీడింగ్‌ నార్మల్‌గానే అవుతున్నా కనీసం పది రోజుల పాటు అవుతుంది. ఇదేమైనా సమస్యా? తనకూ అందరిలా నెలసరి రెగ్యులర్‌ కావాలంటే ఏం చేయాలో చెప్పండి.

- ఓ సోదరి

జ: 18 ఏళ్ల వయసొచ్చేసరికి సాధారణంగా పిరియడ్స్‌ నెలకోసారి రావడం, నాలుగైదు రోజులు బ్లీడింగ్‌ కావడం.. ఇలా ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది. ఈ నేపథ్యంలో - మీ పాపకు నెలసరి ఆలస్యంగా వచ్చి పది రోజుల పాటు బ్లీడింగ్ అవుతోందంటే అందుకు కారణమేమిటో తెలుసుకోవాలి. అందుకోసం తప్పనిసరిగా పాపకు కొన్ని పరీక్షలు చేయించాలి. పిరియడ్స్ నెలనెలా రాకపోతే హార్మోన్ల అసమతుల్యత ఉందని అర్థం. అందుకని అల్ట్రాసౌండ్‌ స్కాన్‌, హార్మోన్ల పరీక్ష చేయడానికి పీసీఓ ప్రొఫైల్‌.. వంటి పరీక్షలు చేయాలి. హార్మోన్ల అసమతుల్యతను జీవనశైలి ద్వారా, మందుల ద్వారా సరిచేస్తేనే ఆమెకు అందరిలాగా సక్రమంగా పిరియడ్స్‌ వస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్