ఒక్క చుట్టూ తిప్పితే చాలు..!

వాటర్‌ బాటిల్స్‌, ఫ్లాస్క్‌లు, లోతైన గాజు/పింగాణీ/స్టీల్‌ గ్లాసులు/కప్పుల లోపలి భాగాల్ని శుభ్రం చేయడం పెద్ద పని! బాటిల్‌ క్లీనింగ్‌ బ్రష్‌తో ఎంత రుద్దినా ఒక్కోసారి అందులో ఉన్న జిడ్డు వదలదు.. అలాగని చేత్తో రుద్దలేం. ఈ సమస్యకు పరిష్కారం చూపడానికే ప్రత్యేకమైన ‘క్లీనింగ్‌ బ్రష్‌’లు అందుబాటులోకొచ్చాయి.

Published : 13 Apr 2024 13:25 IST

వాటర్‌ బాటిల్స్‌, ఫ్లాస్క్‌లు, లోతైన గాజు/పింగాణీ/స్టీల్‌ గ్లాసులు/కప్పుల లోపలి భాగాల్ని శుభ్రం చేయడం పెద్ద పని! బాటిల్‌ క్లీనింగ్‌ బ్రష్‌తో ఎంత రుద్దినా ఒక్కోసారి అందులో ఉన్న జిడ్డు వదలదు.. అలాగని చేత్తో రుద్దలేం. ఈ సమస్యకు పరిష్కారం చూపడానికే ప్రత్యేకమైన ‘క్లీనింగ్‌ బ్రష్‌’లు అందుబాటులోకొచ్చాయి.

చుట్టూ బ్రిజిల్స్‌ ఉన్న పొడవాటి బ్రష్‌, ఆ పక్కనే మరో బ్రష్‌.. ఈ రెండూ అనుసంధానమై ఉన్న ఈ క్లీనింగ్‌ బ్రష్‌కి అడుగున సిలికాన్‌ స్టిక్కర్‌ ఉంటుంది. దీన్ని సింక్‌ వద్ద కిచెన్‌ ప్లాట్‌ఫామ్‌పై లేదంటే సింక్‌ లోపల గోడకు అతికించుకోవచ్చు. ఇప్పుడు చుట్టూ బ్రిజిల్స్‌ ఉన్న బ్రష్‌ని మనం శుభ్రం చేయాలనుకునే బాటిల్‌/గ్లాస్‌లోకి చొప్పించి ఒక్కసారి తిప్పాలి.. దీంతో లోపలి భాగం శుభ్రమవుతుంది.. ఇక మరోవైపు ఉన్న బ్రష్‌ బయటి భాగాన్ని శుభ్రం చేస్తుంది. ఇలా ఏకకాలంలో బాటిల్‌/గ్లాస్‌ శుభ్రమవుతాయి.

ఇక బాటిల్‌/గ్లాస్ క్లీనింగ్‌ కోసం చివర్లో బ్రిజిల్స్‌ ఉన్న పొడవాటి స్టిక్‌ లాంటి బ్రష్‌ కూడా అందుబాటులో ఉంది. దీనిపై ఒక బటన్‌ ఉంటుంది. ఈ బ్రష్‌ని బాటిల్‌/గ్లాస్‌లో ఉంచి ఈ బటన్‌ని నొక్కితే ఆటోమేటిక్‌గా తిరుగుతూ ఆయా వస్తువుల్ని శుభ్రం చేస్తుంది. ఈ స్టిక్‌కి పైవైపు చిన్న చిన్న బ్రష్‌లు అనుసంధానమై ఉంటాయి. వాటి సహాయంతో బాటిల్‌ మూత, చిన్న చిన్న సందుల్లో శుభ్రం చేయచ్చు. పిల్లలు పాలు తాగే బాటిల్స్‌నీ ఈ క్లీనింగ్‌ బ్రష్‌లతో ఈజీగా శుభ్రపరచచ్చు.

Photos: Amazon.in

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్