Mangoes: అందుకే తినేముందు నీళ్లలో నానబెట్టాలి!
మామిడి పండ్లను చూస్తే క్షణమైనా ఆగలేం.. వాటి రుచిని ఆస్వాదించే దాకా మనసు మనసులో ఉండదు. అయితే ఆ ఆతృతే వద్దంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. ఈ పండ్లను తినే ముందు కాసేపు నీళ్లలో నానబెట్టడం వల్ల ఆరోగ్యపరంగా బోలెడు ప్రయోజనాలు చేకూరతాయని చెబుతున్నారు.
మామిడి పండ్లను చూస్తే క్షణమైనా ఆగలేం.. వాటి రుచిని ఆస్వాదించే దాకా మనసు మనసులో ఉండదు. అయితే ఆ ఆతృతే వద్దంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. ఈ పండ్లను తినే ముందు కాసేపు నీళ్లలో నానబెట్టడం వల్ల ఆరోగ్యపరంగా బోలెడు ప్రయోజనాలు చేకూరతాయని చెబుతున్నారు. మరి, అవేంటో తెలుసుకుందాం రండి..
ఎంతసేపు నానబెట్టాలి?
‘ఎ’, ‘సి’, ‘ఇ’, ‘కె’, ‘బి’ విటమిన్లతో పాటు ఫోలేట్.. వంటి పోషకాలు మిళితమై ఉన్న మామిడి పండ్లు రుచిలోనే కాదు.. ఆరోగ్యాన్ని అందించడంలోనూ మిన్నే! ముఖ్యంగా చర్మం, జుట్టు సంరక్షణ విషయాల్లో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు నిపుణులు. అయితే ఈ ప్రయోజనాలన్నీ చేకూరాలంటే తినే ముందు వాటిని 1-2 గంటల పాటు నీటిలో నానబెట్టడం మంచిదంటున్నారు. ఒకవేళ వెంటనే తినాలనుకునే వారు కనీసం పావుగంట పాటైనా నీటిలో నానబెట్టాలట!
చలువ చేస్తుంది!
వేసవిలో తప్ప ఇతర సీజన్లలో దొరకవని కొంతమంది అమితంగా వీటిని లాగించేస్తుంటారు. దీనివల్ల శరీరంలో ఎక్కువ వేడి ఉత్పత్తవుతుంది. ఫలితంగా జీర్ణ సంబంధిత సమస్యలు, ముఖంపై మొటిమలు.. వంటివి తలెత్తుతాయి. ఈ సమస్యలకు దూరంగా ఉండాలంటే తినే ముందు మామిడి పండ్లను నీళ్లలో నానబెట్టాలి. తద్వారా పండ్ల నుంచి శరీరంలో వేడి ఉత్పత్తి చేసే గుణాలు తొలగిపోతాయంటున్నారు నిపుణులు.
రసాయనాలు తొలగాలంటే..
మామిడి పండ్లు త్వరగా పండడానికి వివిధ రకాల రసాయనాలు ఉపయోగిస్తారన్న విషయం తెలిసిందే. ఇలా వాడిన రసాయనాలు పండు తొక్కపై చేరతాయి. అది గమనించకుండా వాటిని ఆదరాబాదరాగా శుభ్రం చేసుకొని తీసుకుంటే.. ఆరోగ్యానికే ప్రమాదం! తద్వారా వివిధ ఆరోగ్య సమస్యలొస్తాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండాలంటే తినే ముందు మామిడి పండ్లను నీటిలో నానబెట్టడమొక్కటే మార్గం! తద్వారా పండు తొక్కకు అంటుకున్న రసాయనాలు తొలగిపోతాయి.
బరువూ తగ్గచ్చు!
మామిడి పండ్లలో ఉండే ఫైటోకెమికల్స్, బయోయాక్టివ్ సమ్మేళనాలు కొవ్వు కణాలు, కొవ్వు సంబంధిత జన్యువులపై ప్రభావం చూపుతాయి. ఈ క్రమంలో మామిడి పండ్లను నీటిలో నానబెట్టడం వల్ల ఈ సమ్మేళనాల గాఢత తగ్గి, శరీరానికి హానికరమైన కొవ్వుని కరిగించడంలో తోడ్పడతాయి. తద్వారా బరువూ అదుపులో ఉంచుకోవచ్చు.. ఆరోగ్యాన్నీ కాపాడుకోవచ్చు. అయితే బరువు తగ్గాలంటే మాత్రం పండ్లను షేక్స్, స్మూతీస్ రూపంలో కాకుండా నేరుగా తినడమే మంచిదంటున్నారు నిపుణులు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- Makeup: ఈ పొరపాట్లు వద్దు!
- మ్యాచింగ్ పోట్లీ మస్తుంది!
- అందానికి చింతపండు..!
- నిర్మలమ్మ ‘బడ్జెట్’ శారీస్.. చీరచీరకో ప్రత్యేకత!
- చినుకుల్లో కురులు జాగ్రత్త!
ఆరోగ్యమస్తు
- ఎత్తును బట్టే..!
- Nayanthara : నచ్చిందే తింటా.. నోరు కట్టేసుకోను!
- ‘అమ్మా’ అనే పిలుపు వినాలని!
- మీ మౌత్‌వాష్ ఎలాంటిది?
- చాందీపుర వైరస్.. పిల్లల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
అనుబంధం
- కొలీగ్‌తో రెండో పెళ్లి.. పేరెంట్స్ వద్దంటున్నారు!
- ‘777’ నియమంతో... బంధం బలోపేతం!
- పిల్లలకు ఎలాంటి పుస్తకం కొంటున్నారు..?
- వాళ్ల ప్రేమ నిజమా? నకిలీనా?
- Sushmita Sen: లైంగిక అంశాల గురించి నా పిల్లలతో అలా చర్చిస్తా!
యూత్ కార్నర్
- పాపులారిటీ కోసం ప్రాణాలెందుకు రిస్క్‌లో పెడతారు?!
- తెలుగమ్మాయి... బ్రిటన్‌లో మెరిసింది!
- వాళ్లున్నప్పుడు మారిపోతాడు!
- రెండేళ్ల కష్టం... రూ.54 లక్షల ఉద్యోగం!
- మలార్ వాట్సాప్... టీచర్!
'స్వీట్' హోం
- వర్షాలకు మొక్కలు పాడవకుండా..!
- మొక్కలకు కాఫీ పొడి వేస్తున్నారా?
- తగిలిస్తే... పిల్లి వచ్చే!
- నూరు వరహాలతో నిండుగా
- వ్యాపారమా... ఉద్యోగమా?
వర్క్ & లైఫ్
- Flower Truck Business: అందమైన పూల బొకేలతో.. లక్షలు సంపాదిస్తూ..!
- బరువెక్కుతున్న తెలుగు రాష్ట్రాలు!
- ఈ అలవాట్లే మనల్ని ధనవంతుల్ని చేస్తాయట!
- కేర్ టేకర్లు... కోట్లలో కావలెను!
- ఆఫీసులో ఒత్తిడి తగ్గుతుందిలా..