గుండె ఆరోగ్యం పైనా వాటి ప్రభావం..

ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా చాలామందిలో గుండె సంబంధిత సమస్యలు వెలుగు చూస్తున్నాయి. అందుకు కారణం అనారోగ్యకరమైన జీవనశైలే అని చెప్పడంలో సందేహం లేదు. కేవలం మగవారిలోనే కాదు.. ఆడవారిలోనూ ఇలాంటి సమస్యలొస్తున్నాయి. అందుకు మహిళల్లో తలెత్తే పీసీఓఎస్, నెలసరి క్రమంగా.....

Published : 26 Dec 2022 19:58 IST

ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా చాలామందిలో గుండె సంబంధిత సమస్యలు వెలుగు చూస్తున్నాయి. అందుకు కారణం అనారోగ్యకరమైన జీవనశైలే అని చెప్పడంలో సందేహం లేదు. కేవలం మగవారిలోనే కాదు.. ఆడవారిలోనూ ఇలాంటి సమస్యలొస్తున్నాయి. అందుకు మహిళల్లో తలెత్తే పీసీఓఎస్, నెలసరి క్రమంగా రాకపోవడం.. వంటి వివిధ ప్రత్యుత్పత్తి సమస్యలు కూడా ఓ కారణమే అంటున్నారు నిపుణులు.

నెలసరికి-గుండె ఆరోగ్యానికి..

ప్రస్తుతం చాలామంది ఆడవారు ఎదుర్కొంటోన్న సమస్యల్లో ఇర్రెగ్యులర్‌ పిరియడ్స్‌ కూడా ఒకటి. అనారోగ్యకరమైన ఆహారపుటలవాట్లు, వ్యాయామం చేయకపోవడం, మానసిక ఒత్తిడి-ఆందోళనలు.. వంటివన్నీ ఈ సమస్యకు ప్రధాన కారణాలు. అయితే దీని కారణంగా గర్భం ధరించడంలో సమస్యలు తలెత్తడం, బరువు పెరిగిపోవడం.. ఇలా ఇవన్నీ ఆడవారి పాలిట శాపాలుగా మారుతున్నాయి. దీనికి తోడు సక్రమంగా నెలసరి రాకపోవడం వల్ల దీర్ఘకాలంలో గుండె జబ్బులు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ అంటున్నారు నిపుణులు. అందుకే ఇర్రెగ్యులర్‌ పిరియడ్స్‌తో బాధపడే మహిళలు గుండెకు సంబంధించి ఏవైనా సమస్యలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ దగ్గరికి వెళ్లి చెకప్‌ చేయించుకోవడం మంచిదని సలహా ఇస్తున్నారు.

పీసీఓఎస్‌తో కూడా..

మనం పాటించే ఆహారపుటలవాట్లు, జీవనశైలి కారణంగా పీసీఓఎస్‌ బారిన పడే మహిళల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఇలా చాప కింద నీరులా విస్తరిస్తోన్న పీసీఓఎస్‌ కారణంగా మహిళల శరీరంలో ఆండ్రోజెన్స్ (పురుష హార్మోన్ల) స్థాయులు పెరిగిపోతాయి. తద్వారా నెలసరి క్రమం తప్పడం, అధిక బరువు, స్థూలకాయం, మధుమేహం, హైపర్‌టెన్షన్‌.. వంటి సమస్యలన్నీ మహిళల ప్రత్యుత్పత్తి వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఇలా ఈ అనారోగ్యాలు క్రమంగా గుండె ఆరోగ్యాన్నీ దెబ్బతీసే అవకాశం ఎక్కువని చెబుతున్నారు నిపుణులు. మరీ ముఖ్యంగా అధిక బరువు, మధుమేహం, అధిక రక్తపోటు.. వంటి సమస్యలతో ముప్పు ఎక్కువగా ఉంటుందట! కాబట్టి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఈ సమస్యల్ని నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్‌ సలహా మేరకు సరైన మందులు వాడడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం, జీవన శైలి ద్వారా పీసీఓఎస్‌ను అదుపు చేసుకోవడం అత్యవసరమని వారు సూచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్