శుభ్రం చేసేయండిలా!

పండగ సమీపిస్తోంది. శుభ్రత విషయంలో హడావుడి పడుతున్నారా? ఈ చిట్కాలు పాటించేయండి.ఒక్కరోజులోనే ఇల్లంతా పూర్తి చేసేయాలన్న తొందరొద్దు.

Updated : 11 Jan 2023 05:06 IST

పండగ సమీపిస్తోంది. శుభ్రత విషయంలో హడావుడి పడుతున్నారా? ఈ చిట్కాలు పాటించేయండి.

* ఒక్కరోజులోనే ఇల్లంతా పూర్తి చేసేయాలన్న తొందరొద్దు. అందుబాటులో ఉన్న సమయాన్ని బట్టి, ప్లాన్‌ చేసుకోండి. ముందు డోర్‌మ్యాట్‌లు, కర్టెన్లు వంటివి తీసి ఉతికేయండి. తర్వాత ప్రతి గదిలోనూ వాడనివీ, పడేయాల్సిన వాటిని తీసేయండి. తేలిగ్గా పూర్తవుతుంది కాబట్టి, లివింగ్‌ రూమ్‌ నుంచి ప్రారంభించేయండి. శుభ్రత ఎప్పుడూ పైనుంచి కింది వైపునకు సాగేలా చూడండి.

* ఆ తర్వాత బాత్‌రూమ్‌ల అరలు సర్దేయండి. ఇక గచ్చు కడగడానికి ఉపయోగించే సహజ లేదా మార్కెట్‌లో దొరికే ఉత్పత్తులను వేసి అలా కొద్దిసేపు ఉంచండి. తర్వాత పడకగదిలోకి వెళ్లండి. అన్నీ ఒకేసారి తీసి తుడిచి ఆపై సర్దేద్దామన్న ధోరణి వద్దు. ఒక్కో అరనీ శుభ్రం చేసుకుంటూ వెళ్లండి. మొత్తం అయ్యాక మార్చాలనుకున్నవి ఏమైనా ఉన్నాయేమో చూసుకొని మార్చేస్తే సరి. ఇదంతా అయ్యాక బాత్రూమ్‌లని కడిగేస్తే త్వరగా మరకలు వదులుతాయి.

* అనవసరంగా ఉన్నవీ, పెద్దగా వాడని వాటిని ఓ సంచి లేదా అట్టపెట్టెలో పెట్టేయండి. ఎవరికైనా ఇచ్చేయొచ్చు. అలా కాకుండా పక్కన పెట్టేసుకుంటూ వెళితే వాటిని తీయడం మరో పనవుతుంది.

* ఇక చివరగా వంటగది. ముందు శుభ్రం చేసినా పండగ ముందు రోజు రాత్రి ఎలాగూ శుభ్రం చేయాలి. దీంతో ఒకే పని రెండు సార్లు చేసినట్టు. కాబట్టి, దీనికి చివర్లో ప్రాధాన్యమివ్వాలి. ఎలక్ట్రానిక్‌ పరికరాలను ముందు శుభ్రం చేసి, ఆపై అరల్లోకి వెళ్లండి. పూజలకు, పెద్ద వంటలకు అవసరమయ్యే పాత్రలను కడిగి పెట్టుకోవాలి. మిగతా వాటిని పాత వస్త్రంతో తుడిస్తే సరిపోతుంది. అలమరాలన్నీ పూర్తయ్యాక స్టవ్‌, బండపై దృష్టిపెడితే శుభ్రత పూర్తయినట్లే!

* మైక్రోఫైబర్‌ వస్త్రాలను ఎంచుకుంటే దులిపేటప్పుడు దుమ్ము ఒళ్లంతా పడటం, అలర్జీల బాధ ఉండదు. పదే పదే నేలను తుడవాల్సిన పనీ ఉండదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్