చలువ చేసే పానకం!

నవమికి పానకం తప్పక చేస్తాం. పేరుకు ప్రసాదంగా తీసుకోవడం కాదు.. ఈ కాలానికి అనుగుణంగా వచ్చే రోగాల నుంచి రక్షించుకునేలా శరీరాన్ని సిద్ధం చేయడమే దీని ఉద్దేశం! పోషకాల గురించి చెబుతూ ఇంటిల్లిపాదికీ అందించేయండి.

Published : 30 Mar 2023 00:26 IST

నవమికి పానకం తప్పక చేస్తాం. పేరుకు ప్రసాదంగా తీసుకోవడం కాదు.. ఈ కాలానికి అనుగుణంగా వచ్చే రోగాల నుంచి రక్షించుకునేలా శరీరాన్ని సిద్ధం చేయడమే దీని ఉద్దేశం! పోషకాల గురించి చెబుతూ ఇంటిల్లిపాదికీ అందించేయండి.

* వేసవిలో ‘అమ్మవారు పోయడం’ ఎక్కువగా కనిపిస్తుంది. పానకంలోని గుణాలు శరీరాన్ని చల్లబరచడమే కాదు ఇది రాకుండానూ అడ్డుకోగలదట. బెల్లం రక్తాన్ని శుద్ధిచేస్తుంది. ఇంకా ఐరన్‌, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లను అందించి, ఎనీమియా బారి నుంచీ కాపాడుతుంది.

* యాలకుల పొడిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. రక్తపోటును తగ్గించడంలో సాయపడతాయి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కొన్ని రకాల అనారోగ్యాలకు వ్యతిరేకంగా పనిచేస్తాయి. జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. నోటిదుర్వాసనకీ మంచి మందు.

* సి, ఎ విటమిన్‌, ఫ్లేవనాయిడ్లు, కెరొటిన్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు మిరియాల్లో పుష్కలం. ఇవి శరీరానికి హాని చేసే మలినాలను బయటకు పంపిస్తాయి. జీర్ణప్రక్రియను మెరుగుపరుస్తాయి. జలుబు, దగ్గును దూరంగా ఉంచుతాయి. దీనిలోని పిపరిన్‌ క్యాన్సర్‌కి వ్యతిరేకంగా పోరాడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికీ దివ్యౌషధం. చర్మంపై ముడతలు రాకుండానూ కాపాడుతుంది.

* తులసి నుంచి ఎ, సి విటమిన్లు, క్యాల్షియం, జింక్‌, ఐరన్‌ పుష్కలంగా అందుతాయి. దీని సువాసనలు ఒత్తిడి, ఆందోళనను దూరం చేస్తాయి. యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ వైరల్‌, యాంటీ ఫంగల్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలెక్కువ. ఇవి రోగనిరోధకతను పెంచుతాయి. * కొన్నిచోట్ల శొంఠిపొడి, నిమ్మరసాన్ని కలుపుతారు. వీటిల్లోని విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధకతను పెంచుతాయి. గర్భిణుల్లో వాంతులు రాకుండా అడ్డుకుంటాయి. బరువును అదుపులో ఉంచడంలోనూ సాయపడతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్