ఫిర్యాదు చేయాలా.. వద్దా?

ఓ మంచి సంస్థలో ఈమధ్యే చేరా. మా డిపార్ట్‌మెంట్‌లో ఒకావిడ 8 గంటల్లో కనీసం 3 గం.లు కూడా పని చేయకపోవడం గమనించా.

Updated : 01 Mar 2023 05:15 IST

ఓ మంచి సంస్థలో ఈమధ్యే చేరా. మా డిపార్ట్‌మెంట్‌లో ఒకావిడ 8 గంటల్లో కనీసం 3 గం.లు కూడా పని చేయకపోవడం గమనించా. మధ్యాహ్న భోజనం, షాపింగ్‌, వ్యక్తిగత ఫోన్‌, చాటింగ్‌, ఇతరులతో కబుర్లతోనే ఎక్కువ సమయం గడిపేస్తుంది. తన తీరు నాకు సహోద్యోగులను గౌరవించకపోవడంలానే కనిపిస్తోంది. ఎందుకంటే పనిలో భాగంగా చాలామంది వినియోగదారులతో మాట్లాడాలి. తను వదిలేసి కూర్చోవడంతో ఆ భారం కాస్తా నా మీద పడుతోంది. ఇన్నేళ్లుగా ఉద్యోగం ఎలా కాపాడుకుంటోందో అర్థమే కావట్లేదు. మేనేజర్‌తో తన గురించి ఫిర్యాదు చేయనా? వదిలేయనా?

-ఆఫ్రిన్‌

బృందంతో పనిచేస్తున్నప్పుడు కావాల్సిన ప్రధాన లక్షణం.. ఓపిక! పైగా మీరు చేరీ కొద్దిరోజులే అయ్యింది. డిపార్ట్‌మెంట్‌కి కొత్త. ఆమె ఏం చేసినా మీ విలువనే పెంచుతోంది. మీ మేనేజర్‌ తన ప్రవర్తనను, ఆ అలవాట్లను ఎందుకు భరిస్తున్నారో తెలియదు. కానీ ఫిర్యాదు చేస్తే మీరే చెడ్డవ్వొచ్చు. పైగా బృందంలో వచ్చే ప్రతి చిన్న సమస్యనీ తమ దాకా తీసుకొచ్చే సభ్యులను ఏ పైఅధికారీ మెచ్చరు. ఒక్కోసారి దాన్ని మీ బలహీనతగానూ పరిగణించొచ్చు. బృందసభ్యులతో కలిసిమెలసి పనిచేయడం ఒక కళ. ముందు ఆ అమ్మాయితో నేరుగా మాట్లాడండి. తన నిర్లక్ష్యం మీకు భారమవుతోందని చెప్పి చూడండి. ఇక్కడ తన చర్యలకు సిగ్గు పడేలా చేయడం మీ ఉద్దేశం కాకూడదు. నిందిస్తున్నట్లుగానూ ఉండొద్దు. అలా చేశారో.. అవతలి వాళ్లు రక్షణ చర్యల్లో పడిపోతారు. మీకు వ్యతిరేకంగానూ మారగలరు. మీ సమస్యను చెబుతున్నట్లుగానే మాట్లాడండి. కలిసి పనిచేద్దామన్న ధోరణిలోనే సంభాషణ సాగించండి. మొత్తంగా తన సాయం మీకు అవసరం అన్న స్పృహ కల్పిస్తే చాలు. పరిస్థితిలో మార్పు కనిపిస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్