యూరిక్‌ యాసిడ్‌ సమస్య తగ్గాలంటే...!

నా వయసు 35. మొన్న ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటే యూరిక్‌ యాసిడ్‌ సమస్య ఎక్కువగా ఉంది... ఆహారంలో మార్పులు చేసుకోవాలన్నారు డాక్టరు.

Published : 05 Jan 2023 01:00 IST

నా వయసు 35. మొన్న ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటే యూరిక్‌ యాసిడ్‌ సమస్య ఎక్కువగా ఉంది... ఆహారంలో మార్పులు చేసుకోవాలన్నారు డాక్టరు. నేను ఏం తినాలో? తినకూడదో చెప్పగలరు.

- నిత్య, హైదరాబాద్‌

* శరీరంలో యూరిక్‌ యాసిడ్‌ ఎక్కువగా ఉండే స్థితిని గౌట్‌ అంటాం. ఈ ఇబ్బంది ఉన్నప్పుడు బరువు పెరుగుతుంటే సమస్య కూడా ఎక్కువ అవుతుంది. అందుకే తప్పనిసరిగా దాన్ని నియంత్రించుకోవాలి. మీ ఎత్తుకు తగ్గ బరువు ప్రకారం బాడీ మాస్‌ ఇండెక్స్‌ ఉండేలా చూసుకోవాలి. అంటే అది 25 కంటే తక్కువగా ఉండాలి. అలానే ప్యూరిన్‌, ప్రొటీన్‌ ఎక్కువగా ఉండే పదార్థాల మోతాదుని తగ్గించుకోవాలి. తప్పనిసరై అలాంటివి తీసుకున్నప్పుడు నీళ్లెక్కువగా తాగడం, పండ్ల రసాలు తీసుకోవడం వంటివి చేయాలి. ఈ పద్ధతుల వల్ల సహజంగానే బరువు అదుపులోకి వస్తుంది. సమస్య తీవ్రతా తగ్గుతుంది. కాంప్లెక్స్‌ కార్బోహైడ్రేట్స్‌ని అందించే పండ్లూ, కూరగాయలు, తృణధాన్యాలను ఎక్కువగా తీసుకోవాలి. వైట్‌ బ్రెడ్‌, కేకులూ, క్యాండీలూ, కూల్‌డ్రింక్స్‌, ఫ్రక్టోజ్‌ ఉండే కార్న్‌ సిరప్‌ వంటివాటికి దూరంగా ఉండాలి. లో ఫ్యాట్‌ పెరుగూ, పాలు వంటివి తీసుకోవచ్చు. పాలకూర, బఠాణీలు, క్యాలీప్లవర్‌, పుట్టగొడుగులు వంటి వాటిల్లో ప్యూరిన్‌ మోతాదు ఎక్కువగా ఉన్నప్పటికీ వీటివల్ల ఎదురయ్యే ప్రమాదం తక్కువే. అయితే మీ ఆహారం నుంచి తగినంత సి రోజూ అందేలా చూసుకోండి. ఈ మార్పులు మీ సమస్యని క్రమంగా తగ్గిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్