పీచుతో కుండీలు చేస్తారు!

మనకు లభించే ప్రకృతి వనరులను వ్యర్థం కాకుండా వినియోగించాలనేది ఆమె సిద్ధాంతం. పర్యావరణానికి పెనుముప్పు కలిగించే ప్టాస్టిక్‌ను నిరోధించాలనేది ఆమె సంకల్పం. ఆ ఆశ, ఆశయాల సాధనలో డాక్టర్‌ మీరా స్ఫూర్తి ప్రయాణం ఇలా సాగింది...

Updated : 06 Feb 2023 00:36 IST

మనకు లభించే ప్రకృతి వనరులను వ్యర్థం కాకుండా వినియోగించాలనేది ఆమె సిద్ధాంతం. పర్యావరణానికి పెనుముప్పు కలిగించే ప్టాస్టిక్‌ను నిరోధించాలనేది ఆమె సంకల్పం. ఆ ఆశ, ఆశయాల సాధనలో డాక్టర్‌ మీరా స్ఫూర్తి ప్రయాణం ఇలా సాగింది...

సౌరశక్తిని వినియోగిస్తారు. వాన నీటిని ఒడిసిపట్టుకుంటారు. వర్షాధార పంటలు పండిస్తారు. పండ్లు, కూరగాయల వ్యర్థాలను వృథా చేయక వర్మీకంపోస్ట్‌గా మారుస్తారు. అన్నిటినీ మించి ప్లాస్టిక్‌ను అరికట్టేందుకు ప్రయత్నిస్తారు. ప్రకృతికి దగ్గరగా, కాలుష్యాలకు దూరంగా జీవించాలనేది ఈ అక్కచెల్లెళ్ల లక్ష్యం.
మంగళూరుకు చెందిన ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్‌ మీరా. ఔషధాల్లో అధికశాతం మొక్కల నుంచే ఉత్పత్తి అవుతాయి కనుక అవంటే ఆమెకి మరింత ప్రేమ. మొక్కల్ని విస్తృతంగా పెంచాలని ఎంత ఆశిస్తారో.. వాటికి సాధనాలుగా ప్లాస్టిక్‌ కుండీలు వాడకూడదని అంతే బలంగా కోరుకుంటారు. అందుకోసం ఆమె సోదరి నయనతారతో కలిసి 2022లో సంజీవిని గార్డెన్‌ ప్రొడక్ట్స్‌ ప్రారంభించారు. ఇది మంగళూరుకు సమీపంలో అడయార్‌ కానూరులో ఉంది.

మిద్దెతోటలకు మేలు..

మొక్కల పెంపకంలో విస్తారంగా వాడుతున్న ప్లాస్టిక్‌ కుండీలకు బదులుగా కొబ్బరిపీచుతో కుండీలు రూపొందుతాయిక్కడ. ఇవి ఇండోర్‌ ప్లాంట్స్‌కు, మిద్దె తోటలకు కూడా అనుకూలమే. కొబ్బరిపొట్టుకు ఆవుపేడ జోడించిన పోషకాల ఎరువు కూడా ఇక్కడ తయారవుతోంది. దాంతో మొక్కలు ఏపుగా పెరుగుతాయి. అది గుల్లగా ఉండటాన వేళ్లు పాతుకుపోతాయి.

ఈ కుండీలు వివిధ సైజుల్లోనూ, వేలాడదీసేందుకు కొక్కేలతోనూ తయార వుతున్నాయి. తులసి, లెమన్‌గ్రాస్‌, బెండ, పచ్చిమిరప లాంటి చిన్నమొక్కలు, మల్లె, కనకాంబరం లాంటి పూల మొక్కలు, రకరకాల తీగపాదులు ఏవైనా వీటిల్లో పెంచుకోవచ్చు. ఈ కుండీలు రూ.45 నుంచి 250 రూపాయిల ఖరీదులో అందిస్తున్నారు. ఈ ఎకోఫ్రెండ్లీ కుండలు పర్యావరణాన్ని సంరక్షిస్తాయి, మరింత ఆరోగ్యదాయకమైన పూలూఫలాల నిస్తాయి. ‘కానూరు యూనిట్‌లో హైదరాబాద్‌ నుంచి హైడ్రానిక్‌ యంత్రాలను, కేరళ నుంచి కొబ్బరి పీచును తెప్పించి ఈ కుండలు, కుండీలను తయారుచేస్తున్నాం. వీటిని నగరాల్లో ఎక్కువ ఉపయోగిస్తున్నారు. చెట్లను సద్వినియోగం చేసుకునే విషయమై మనవాళ్లకు అవగాహన పెంచాల్సి అవసరముంది. కొబ్బరిపీచు, ఖాళీ చిప్పలతో రూపొందే ఈ కుండీల్లో కృత్రిమ పదార్థాలేవీ ఉండవు. రంగులు కూడా వేయం. నీళ్లను పీల్చుకుని రోజంతా తేమగా ఉండటం వల్ల మొక్కలు చక్కగా ఎదుగుతాయి. తేలికగా ఉంటాయి. అన్నిటినీ మించి కాలుష్యరహితం, ఆరోగ్యహితం’ అంటారామె.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్