వక్షోజాలు చిన్నగా ఉంటే పాలు పడవా?

నమస్తే మేడమ్‌.. నాకిప్పుడు ఎనిమిదో నెల. క్రమం తప్పకుండా అన్ని పరీక్షలు చేయించుకుంటున్నా. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు.

Published : 29 Nov 2023 19:28 IST

నమస్తే మేడమ్‌.. నాకిప్పుడు ఎనిమిదో నెల. క్రమం తప్పకుండా అన్ని పరీక్షలు చేయించుకుంటున్నా. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. అయితే నన్నొక సమస్య తీవ్రంగా బాధిస్తోంది. అదేంటంటే నా వక్షోజాలు కాస్త చిన్నగా ఉంటాయి. ఇన్నాళ్లూ దాన్నో లోపంగా భావించలేదు.. కానీ దీనివల్ల పుట్టబోయే నా బిడ్డకు తగినన్ని పాలు ఉత్పత్తి కావేమోనన్న ఆందోళన నన్ను వేధిస్తోంది. ఇది ఎంత వరకు నిజం? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. చనుబాల విషయంలో మీరు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు. వక్షోజాల పరిమాణం, వాటి ఆకృతి పాల ఉత్పత్తిని ప్రభావితం చేయలేవు. దీనివల్ల పాల ఉత్పత్తి తగినంతగా లేకపోవడం, బిడ్డకు సరిపడునన్ని పాలు ఇవ్వలేకపోవడం అనేది జరగదు. కాబట్టి ఈ విషయం గురించి ఆలోచించడం మాని.. పాల ఉత్పత్తి పెరిగేలా తీసుకునే ఆహారంలో పలు మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఉడికించిన కోడిగుడ్లు, పాలు, పాల పదార్థాలు, బీన్స్‌, పప్పులు, చేపలు.. వంటి ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి.. అలాగే తాజా పండ్లు, కాయగూరలకు ప్రాధాన్యమివ్వాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి. ఇక ప్రసవం తర్వాత ఎలాంటి పథ్యాలు చేయకపోవడం మంచిది. అలాగే రెండు గంటలకోసారి ఆహారం తీసుకోవాలి. దీనివల్ల పాల ఉత్పత్తి పెరుగుతుంది. మరో విషయం ఏంటంటే.. బిడ్డను గుండెకు హత్తుకోవడం వల్ల కూడా మెదడులో ఉండే కొన్ని కణాలు ఉత్తేజితమవుతాయి. తద్వారా కూడా పాల ఉత్పత్తి పెరుగుతుంది. కాబట్టి అనవసరమైన అపోహల్ని మనసులో నుంచి తొలగించి ప్రస్తుతం ప్రెగ్నెన్సీని ఎంజాయ్‌ చేయండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్