పదార్ధాలు పొంగిపోకుండా..

అన్నం, పాలు తరచూ గిన్నెలోంచి స్టౌ మీదకు పొంగిపోతుంటాయి. అలా జరగకుండా ఉండడానికి ఈ స్పిల్ స్టాపర్ ఉపయోగపడుతుంది. గుండ్రటి ఆకారంలో ఉండి, పువ్వులా విచ్చుకునే ఈ సిలికాన్ స్పిల్ స్టాపర్ గిన్నెలోంచి అన్నం, పాలు వంటివి....

Updated : 10 Oct 2022 14:42 IST

అన్నం, పాలు తరచూ గిన్నెలోంచి స్టౌ మీదకు పొంగిపోతుంటాయి. అలా జరగకుండా ఉండడానికి ఈ స్పిల్ స్టాపర్ ఉపయోగపడుతుంది. గుండ్రటి ఆకారంలో ఉండి, పువ్వులా విచ్చుకునే ఈ సిలికాన్ స్పిల్ స్టాపర్ గిన్నెలోంచి అన్నం, పాలు వంటివి పొంగకుండా కాపాడుతుంది. అంతేకాదు ఆ ఆవిరికి కూరగాయ ముక్కలను కూడా ఉడికిస్తుంది.

అలాగే గిన్నెలోని పదార్థం పొంగకుండా మూతను కొద్దిగా తెరిచి ఉంచడానికి యాంటీ ఓవర్‌ ఫ్లో గ్యాడ్జెట్‌ ఉపయోగపడుతుంది. వివిధ ఆకృతులలో లభించే ఈ గ్యాడ్జెట్ సిలికాన్‌తో తయారవుతుంది. ఆన్‌లైన్‌లో ఇవి అందుబాటులో ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్