టిష్యూ హోల్డర్స్‌.. వెరైటీగా..!

టిష్యూ పేపర్స్‌ ఇప్పుడు మన జీవనశైలిలో భాగమైపోయాయి. కిచెన్‌, డైనింగ్‌ టేబుల్‌, రెస్టరంట్లలో చేతులు శుభ్రం చేసుకోవడానికి వీటిని ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. అలాగే వస్తువుల్ని క్లీన్‌ చేయడానికి, ఆభరణాల్ని అందులో చుట్టి భద్రపరచడానికి.. ఇలా మన నిత్య జీవితంలో ఎన్నో రకాలుగా వీటిని....

Published : 26 Oct 2022 17:15 IST

టిష్యూ పేపర్స్‌ ఇప్పుడు మన జీవనశైలిలో భాగమైపోయాయి. కిచెన్‌, డైనింగ్‌ టేబుల్‌, రెస్టరంట్లలో చేతులు శుభ్రం చేసుకోవడానికి వీటిని ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. అలాగే వస్తువుల్ని క్లీన్‌ చేయడానికి, ఆభరణాల్ని అందులో చుట్టి భద్రపరచడానికి.. ఇలా మన నిత్య జీవితంలో ఎన్నో రకాలుగా వీటిని వాడుతుంటాం. ఇక ఇంటికొచ్చిన అతిథులకు స్నాక్స్‌తో పాటు టిష్యూ పేపర్స్‌ కూడా అందించడం పరిపాటే! చాలామంది వాటిని సర్వింగ్‌ ప్లేట్లో/బౌల్‌లోనే పెట్టి ఇస్తుంటారు. కానీ దానికి బదులు మీరు సర్వ్‌ చేసే డైనింగ్‌ టేబుల్‌/స్నాక్స్‌ టేబుల్‌పై ఓ టిష్యూ హోల్డర్‌ని అమర్చి చూడండి.. ఇటు ఆకర్షణీయంగా ఉండడంతో పాటు అటు అతిథుల మనసూ దోచుకోవచ్చు. ఇలాంటి హోల్డర్స్‌ సాదాసీదాగా కాకుండా ప్రస్తుతం విభిన్న డిజైన్లలో దొరుకుతున్నాయి.

వింటేజ్‌ రేడియో, చెక్కతో తయారుచేసినవి, రిక్షా/స్కూటర్‌ ఆకృతిలో ఉన్నవి, సెరామిక్‌, కాటన్‌ క్యాండీ, ఇల్లు ఆకృతిలో చేసినవి, విభిన్న లోహాలతో పక్షుల ఆకృతిలో తయారుచేసినవి.. ఇలా బోలెడన్ని వెరైటీల్లో డిజైన్‌ చేసిన టిష్యూ హోల్డర్స్‌ ప్రస్తుతం మార్కెట్లో వినియోగదారుల్ని ఆకట్టుకుంటున్నాయి. వీటిలో కొన్నింటిని గోడలకూ ఫిక్స్‌ చేసుకోవచ్చు. ఇంటికి అందాన్ని, ఆధునికతను జోడిస్తోన్న అలాంటి మోడ్రన్‌ టిష్యూ హోల్డర్స్‌పై మీరూ ఓ లుక్కేయండి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్