వాంతులవుతున్నా.. పోషకాలు అందాలంటే

వయసు ముప్పై. మొదటిసారి గర్భం దాల్చా. మూడోనెల వచ్చినప్పట్నుంచీ ఏం తిన్నా పడట్లేదు. కొన్ని వాసనలైతే అస్సలు భరించలేకపోతున్నా. ఆహారమంటేనే విరక్తి వచ్చేసింది. ఈ పరిస్థితిని అధిగమించేదెలా?

Updated : 09 Feb 2023 00:46 IST

వయసు ముప్పై. మొదటిసారి గర్భం దాల్చా. మూడోనెల వచ్చినప్పట్నుంచీ ఏం తిన్నా పడట్లేదు. కొన్ని వాసనలైతే అస్సలు భరించలేకపోతున్నా. ఆహారమంటేనే విరక్తి వచ్చేసింది. ఈ పరిస్థితిని అధిగమించేదెలా? బిడ్డకూ, నాకూ పోషకాలు సరిగా అందాలంటే ఏం చేయాలో సలహా ఇవ్వగలరు.

- స్వేచ్ఛ, తిరుపతి

కొంతమంది గర్భిణుల్లో హార్మోన్ల తేడా వల్ల ఇలా జరుగుతుంది. వాసనల విషయంలోనూ ఈ ఇబ్బంది ఉంటుంది. కొందరికి అన్నం వండుతున్న వాసన పడదు. ఇంకొందరికి సబ్బు పరిమళమూ నచ్చదు. అయితే, నెలలు గడిచే కొద్దీ ఈ సమస్య తగ్గుతుంది. నిజానికి ఎక్కువమందిలో వాంతులు అవుతున్న భావనే తప్ప...వాంతి కాదు. ఇలాంటప్పుడు ఎంతో ఇష్టమైన ఆహారం కూడా సహించదు. అందుకే అంతా నోటికి రుచించే ఆహారం పెడదామని, పుల్లగా, కారంగా ఉన్న పచ్చళ్లు, ఘాటైన మాసాలా ఆహారాన్ని పెడుతుంటారు. వేపుళ్లూ, గ్రేవీ కర్రీలు తింటుంటారు. అందులోని పదార్థాల ప్రభావంతో మరింత వికారం ఎక్కువవుతుంది. పైగా ఇవి ఆలస్యంగా జీర్ణమవుతాయి. అందుకే బయటకు వచ్చేస్తుంది. గర్భం దాల్చినప్పుడు సహజంగా జీర్ణ ప్రక్రియ వేగం తగ్గుతుంది. పైగా ఈ సమయంలో తల్లితో పాటూ కడుపులోని బిడ్డకు కూడా సరిపోయేలా తినాలంటూ... చిక్కటి పాలు తాగడం, డ్రైఫ్రూట్స్‌ తినడం, జ్యూస్‌లు పదే పదే తాగడం, కనిపించిన ఆహారాన్నల్లా నోట్లో వేసుకోవడం చేస్తారు. పోషకాహారాన్ని తీసుకోవాలన్న మాట నిజమే కానీ ఈ పద్ధతిలో కాదు. తేలిగ్గా జీర్ణమవ్వాలి. పొట్టలో ఎక్కువ స్థలాన్ని ఆక్రమించకుండా ఉండే సమతులాహారాన్ని తీసుకోవాలి. చిన్న కప్పుతో దానిమ్మ, బత్తాయి వంటి రసాల్ని, రాగి జావ, ప్లెయిన్‌ కస్టర్డ్‌నూ బ్రేక్‌ఫాస్ట్‌గా సెరల్స్‌, అటుకులు వంటివి పాలూ, పెరుగుతో కలిపి తినొచ్చు. డ్రై ఇడ్లీ, డ్రై టోస్ట్‌, బ్రెడ్‌ జామ్‌ వంటివీ మంచివే. ఇవన్నీ కడుపు నిండిన భావన కలిగించడంతో పాటు తేలిగ్గా అరుగుతాయి. తగిన పోషకాల్నీ అందిస్తాయి. సమయానికి ఆకలవుతున్నా...ఏమీ తినలేకపోతుంటే మాత్రం క్యారెట్‌, గుమ్మడికాయ వంటి వాటితో చేసిన వెజిటెబుల్‌ సూప్స్‌, నానబెట్టిన కిస్‌మిస్‌, డేట్స్‌ని స్మూతీల్లా చేసుకొని తాగితే...బరువు తగ్గరు. పోషకాలూ అందుతాయి. అయితే, నెలలు నిండుతున్నా కొంతమందికి వాంతులు తగ్గవు. సరిగా ఆహారం తీసుకోలేక బరువూ తగ్గుతుంటారు. ఇలాంటివారు కచ్చితంగా వైద్యుల్ని సంప్రదించాలి. అప్పుడు వారు మీకు అవసరమైన పోషకాల ఆధారంగా ఫుడ్‌ సప్లిమెంట్‌లు సూచిస్తారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్