సంస్థను అలా అడగొచ్చా?

మా సంస్థ ఏడాదిగా అన్ని బ్రాంచీలతో కలిసి ఓ కాన్ఫరెన్స్‌ ప్లాన్‌ చేస్తోంది. దానిలో ప్రదర్శించే ఓ ప్రాజెక్టును చేస్తానని నేనే ముందుకొచ్చి మరీ తీసుకున్నా.

Published : 04 Jan 2023 00:48 IST

మా సంస్థ ఏడాదిగా అన్ని బ్రాంచీలతో కలిసి ఓ కాన్ఫరెన్స్‌ ప్లాన్‌ చేస్తోంది. దానిలో ప్రదర్శించే ఓ ప్రాజెక్టును చేస్తానని నేనే ముందుకొచ్చి మరీ తీసుకున్నా. దాని పూర్తి బాధ్యత నాదే. అయితే కొన్నాళ్లుగా వేరే ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్నా. దాదాపు ఖాయమయ్యేలా ఉంది. కాన్ఫరెన్స్‌కు ముందే వెళ్లిపోతే ప్రాజెక్టు వృథా అవుతుంది. ఇప్పుడు నేనేం చేయాలి? కొత్త సంస్థ యాజమాన్యాన్ని కాన్ఫరెన్స్‌కు హాజరయ్యే అనుమతి ఇవ్వమని అడగనా? అలా అడగడం సబబేనా?

- శిల్ప

అంత ముఖ్యమైన ప్రాజెక్టుకు మీరొక్కరే బాధ్యులుగా ఉండటం ఆశ్చర్యకరమే! వృత్తిలో మెరుగైన అవకాశాల కోసం వెదకడంలో తప్పు లేదు. అయితే సంస్థ నుంచి బయటకు వెళ్లాలనుకున్నప్పుడు అది గౌరవప్రదంగా జరిగేలా చూసుకోవాలి. మీ ప్రాజెక్టులను ఇతరులకు అప్పగించడం, మీ స్థానాన్ని భర్తీ చేయబోయే వారికి సరైన శిక్షణ, బాధ్యతలను అప్పగించడంలో చిత్తశుద్ధి మీ వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తాయి. కాబట్టి, వచ్చిన అవకాశాన్ని అందుకోవాలన్న తపనలో సరైన ప్రణాళిక లేకుండా తొందరపడి ఉద్యోగాన్ని మానేయొద్దు. ముందు మీ బాస్‌ను కలవండి. మీ ప్రాజెక్టులో కలిసి పనిచేయడానికి ఇంకొకరు తోడు కావాలని అడగండి. అప్పుడు సంస్థను వీడాల్సిన రోజు వస్తే మరొకరు మీ బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఆ వ్యక్తికి దగ్గరుండి అన్ని విషయాలూ నేర్పించండి. సమస్యలు ఎదురయ్యే అవకాశాలు, వాటిని ఎలా ఎదుర్కోవాలన్న వాటికీ సిద్ధం చేయండి. ఆత్మవిశ్వాసంతో ప్రాజెక్టు పూర్తి చేసేలా తర్ఫీదు ఇవ్వండి. అప్పుడు మీరున్నా.. లేకపోయినా ప్రాజెక్టు ఆగదు. మీకూ అపరాధ భావన ఉండదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్