జీతం తగ్గితే నష్టమా, లాభమా?

మా వారికి ఈమధ్యే బెంగళూరు నుంచి వైజాగ్‌కి బదిలీ అయ్యింది. నేనూ ఇక్కడికే మార్పించుకున్నా. ఇక్కడ పని అంత ఉత్తేజంగా లేదు.

Published : 11 Jan 2023 00:36 IST

మా వారికి ఈమధ్యే బెంగళూరు నుంచి వైజాగ్‌కి బదిలీ అయ్యింది. నేనూ ఇక్కడికే మార్పించుకున్నా. ఇక్కడ పని అంత ఉత్తేజంగా లేదు. వేరే ఉద్యోగం కోసం ప్రయత్నిద్దామంటే బెంగళూరుతో పోలిస్తే ఇక్కడ జీతాలు చాలా తక్కువ. ఖర్చులూ తక్కువే! ఆర్థికంగా ఏ లోటూ లేదు. కాబట్టి, జీతం తగ్గినా సమస్యేమీ లేదు. కానీ తగ్గుతోందన్న ఆలోచనే మింగుడు పడటం లేదు. నేనెప్పుడూ జీతం పెరగడాన్ని ఎదుగుదలగా భావిస్తా. తగ్గుతోందంటే వెనకబడ్డట్టేగా! ఇది నా వృత్తిజీవితానికి ఇబ్బంది అవుతుందా? ఎంత తగ్గితే సమస్యగా భావించాలి? కొత్త ఉద్యోగంలో తక్కువ పనివేళలు, ఒత్తిడి ఉండకపోవడం, ఎక్కువ సెలవులు, ఇంటి అద్దె అలవెన్సులు లాంటివి చాలానే ఉన్నాయి. ఈ జీతంలోకి రాని లాభాలను ఎలా లెక్కేసుకోవాలి? ఇంత తగ్గితే లాభం, ఇంతైతే నష్టమని చెప్పే లెక్కలేమైనా ఉన్నాయా?           

- నిత్య, వైజాగ్‌

ప్రతి నిర్ణయాన్నీ లెక్కలతో ముడిపెట్టలేం. దీనికి అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ముందు జీతం పెరిగితేనే కెరియర్‌లో ఎదిగినట్లు అన్న భావనని పక్కన పెట్టండి. ఉద్యోగపరంగా ఏ దశలో ఉన్నారో ఆలోచించుకోండి. ఇప్పుడు చేస్తున్న దానికంటే ముందంజలో ఉన్నారా? ఇలా ఉద్యోగం మారడానికి తగిన కారణమేంటో ఇంటర్వ్యూయర్‌కి ఎలా వివరించాలి? వంటివి ఆలోచించుకోండి. మీ పురోగతినీ, విజయాలను చెప్పడానికి జీతమే అవసరం లేదు. ఇంకా చాలా అంశాలుంటాయి. ఇక ‘జీతమెంత తగ్గితే ఫర్లేదు’ అన్న మీ ప్రశ్నకి.. ఇది పూర్తిగా మీరు ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకున్నారన్న దానిపై ఆధారపడి ఉంటుంది. రోజువారీ జీవితంలో తప్పనిసరి అన్న అవసరాలకు సరిపడా జీతం వస్తోందా? అయితే స్కూల్‌ ఫీజు, సేవింగ్స్‌, హోదా వంటివి పరిశీలించుకోండి. సంతృప్తికరంగా ఉంటే ‘జీతం తగ్గింది’ అన్నచోట ఆగాల్సిన అవసరం లేదు. అలాగని ఏదో ఒక ఉద్యోగం అని రాజీ పడాల్సిన పనీ లేదు. చాలామంది నచ్చనిది చేస్తూనే సగం జీవితం గడిపేస్తుంటారు. ప్రస్తుతం మీకూ చేస్తున్నది నచ్చట్లేదు. అలాంటప్పుడు ఆకర్షించే జీతం వెంటపడటం కంటే.. సంతృప్తినిచ్చేది ఎంచుకోవడం నయం కదా!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్