Job Opportunity: వాళ్లనెలా అడగను

చిన్న పట్టణంలో చదివా. మూడు నెలలుగా ఉద్యోగం కోసం వెదుకుతున్నా. అవకాశాలు ఎలా దక్కించుకోవాలో తెలీడం లేదు. గతంలో పనిచేసిన సహోద్యోగులు, బాస్‌లను సాయమడిగా. ఫలితం లేదు.

Updated : 29 Mar 2023 00:05 IST

చిన్న పట్టణంలో చదివా. మూడు నెలలుగా ఉద్యోగం కోసం వెదుకుతున్నా. అవకాశాలు ఎలా దక్కించుకోవాలో తెలీడం లేదు. గతంలో పనిచేసిన సహోద్యోగులు, బాస్‌లను సాయమడిగా. ఫలితం లేదు. దీంతో ప్రొఫెషనల్‌ గ్రూపులు, కళాశాల పూర్వవిద్యార్థులు, లింక్‌డిన్‌ గ్రూప్‌ల్లో చేరా. సమస్యల్లా వీళ్లు నాకు పెద్దగా పరిచయం లేదు. నా గురించీ, గత పని అనుభవం గురించీ ఎదురెళ్లి చెప్పలేను. ఏమైనా అవకాశాల గురించి తెలుస్తుందేమో అని చూడటం, ఏమీ తెలియక నిరాశతో ఫోన్‌ పక్కన పెట్టేయడం. ఏం చేయాలో తెలియక పిచ్చెక్కుతోంది. ఏం చేయను?

 - ప్రియాంక

ర్చువల్‌గా సాయం అడగడం తెలియక ఇబ్బందిపడే వారు ఎక్కువమందే. మీలాంటి అంతర్ముఖులకు మరీ కష్టం. చాలామంది ఉద్యోగార్థులు తమ నెట్వర్కింగ్‌ స్కిల్స్‌కి ‘సి’ అంతకంటే తక్కువే రేటింగ్‌ ఇచ్చుకుంటారట. నిజానికి కెరియర్‌కి ఇది చాలాముఖ్యం. అయితే ప్రారంభించడమే సమస్య!

* పరిచయస్థులందరికి ర్యాంకింగ్‌ ఇచ్చుకొని.. తేలిక అనుకున్నవాళ్లతో మాట్లాడటం మొదలుపెట్టండి. చాలాసార్లు అవతలివాళ్లని అడగకుండానే సాయం చేయరన్న అభిప్రాయానికి వచ్చేస్తుంటాం. నోరు తెరిచి అడగండి. తర్వాతే నిర్ణయానికి రండి. అందరివీ హడావుడి జీవితాలే. ఒక్కసారికే గుర్తుండిపోవాలని లేదు. కాబట్టి, మీ గురించి మనసులో నాటుకుపోయేలా ఎలా పరిచయం చేసుకోవాలో ముందుగానే సాధన చేయండి. అవతలి వాళ్ల పని, అనుభవం వంటివి తెలుసుకొని, వాటిని ప్రస్తావిస్తూ మాట్లాడితే అభిప్రాయం సులువుగా ఏర్పరచుకోగలుగుతారు.

* ఉద్యోగం కావాలని కాదు. సలహా అడుగుతున్నట్టుగా ప్రయత్నిస్తే మేలు. అప్పుడు మీకు తెలియని, మీ ప్రొఫైల్‌కి సరిపోయే కొత్తవాటి గురించి తెలిసే వీలుంటుంది. సాయం తీసుకోవడానికే పరిమితమవొద్దు. తిరిగి సాయమందించాలి. వాళ్లకు ఉపయోగపడే కాంటాక్ట్స్‌, వార్తలు లాంటివి పంపొచ్చు.

* చివరగా సాయానికి ముందుకొచ్చిన వాళ్లందరి ఈమెయిల్స్‌ జాబితా సిద్ధం చేసుకోండి. ఉద్యోగవేటలో భాగంగా ఎవరిని కలిశారు, ఇంటర్వ్యూ విధానం వంటివన్నీ చెబుతుండండి. తర్వాత ఏం చేయొచ్చో వాళ్లే సలహానిస్తారు. రెండువైపులా లాభం కలిగేలా చూసుకుంటే మీ ఈమెయిల్స్‌ని తలనొప్పిగా భావించక.. ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తారు. అయితే దీన్ని కొనసాగించటం మాత్రం తప్పనిసరి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్