చిన్నపిల్లలా చూస్తున్నారు!

వయసు 38 ఏళ్లు. ఎత్తూ అయిదడుగులే! వంశపారంపర్యం, నేను తీసుకునే శ్రద్ధ కారణంగా చిన్నదానిలా కనిపిస్తా. చాలామంది ప్రెషరా అని అడుగుతుంటారు.

Published : 08 Feb 2023 00:17 IST

వయసు 38 ఏళ్లు. ఎత్తూ అయిదడుగులే! వంశపారంపర్యం, నేను తీసుకునే శ్రద్ధ కారణంగా చిన్నదానిలా కనిపిస్తా. చాలామంది ప్రెషరా అని అడుగుతుంటారు. ఆఫీసులో  ఇబ్బంది అవుతోంది. ఎవరూ నన్ను సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఏం చేయను? 40ల్లోకి వెళ్లబోతున్నా. తోటివాళ్లు నన్ను, నాలోని పోటీతత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పరిగణనలోకి తీసుకోవాలంటే ఏం చేయాలి? 

 - నందన, ఒడిశా

ఆహార్యం, మిమ్మల్ని మీరు వ్యక్తీకరించే విధానంలో మార్పులు చేసుకోండి. పరిస్థితిలో చాలావరకూ మార్పు ఉంటుంది. అందుకోసం ఈ అలవాట్లు, చిట్కాలపై దృష్టిపెట్టండి.

వ్యక్తిపై మొదటి ముద్రకు ప్రధాన కారణం దుస్తులే! మీరు కనిపించే విధానమే మీ భావనలను వ్యక్తపరుస్తాయి. ఆత్మవిశ్వాసంతో కనిపించకపోతే పనిలో మాత్రం దాన్నెలా చూపించగలరు? కాబట్టి, ఆఫీసుకు వేసే దుస్తులు ట్రెండీగా, ఫ్యాషన్‌గా కాకుండా నీట్‌గా, ముదురు రంగుల్లో ఉండేలా చూసుకోవాలంటారు నిపుణులు. మొత్తంగా చూడగానే మీ ఉద్దేశం కనిపించేలా దుస్తులుండాలి. మాట గొంతులోంచి కాకుండా గుండెల్లోంచి వస్తున్నట్లుగా దృఢంగా ఉండాలి. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌పై దృష్టిపెట్టండి. మాట్లాడే తీరు, ముఖ కవళికలు, స్వరంలో హెచ్చుతగ్గులు, పదాల ఎంపిక వంటి వాటన్నింటినీ గమనించుకోండి. ఇవన్నీ పని ప్రదేశంలో మిమ్మల్ని ఎంతమేరకు సీరియస్‌గా తీసుకుంటున్నారో నిర్ణయించేవే. మీటింగ్‌లు ఉంటే ఏం మాట్లాడాలి, ఎలా సమాధానమివ్వాలనేది ముందుగానే సిద్ధమవ్వండి. కనిపించే విధానం కూడా కొన్నిసార్లు వివక్షకు కారణమే. దాదాపుగా అందరూ ఈ కారణంగానే ఇబ్బంది పడుతుంటారు కూడా. అలాగని మీ ఎత్తును చూసి బాధపడాల్సిన పనిలేదు. మీ వ్యక్తిత్వాన్ని బలంగా నిర్మించుకునే ప్రయత్నం చేయండి. విశ్వసనీయత, నిజాయతీ ప్రదర్శిస్తూనే పరిస్థితి ఏదైనా ఆధారపడగల వ్యక్తిగా ఎదగండి. అప్పుడు సీరియస్‌గా తీసుకోకుండా ఉండలేరు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్