అన్ని మెసేజ్‌లు.. తట్టుకోలేకపోతున్నా!

నాదో చిన్న వ్యాపారం. నావద్ద పనిచేసే ఓ అమ్మాయి చాలా బాగా పనిచేస్తుంది. సమస్యల్లా భావోద్వేగాలపరంగా ఇతరులపై ఆధారపడుతుంటుంది. ఎప్పుడైనా ఒక కొటేషన్‌, వీడియో అయితే ఫర్లేదు.

Updated : 17 Feb 2023 07:20 IST

నాదో చిన్న వ్యాపారం. నావద్ద పనిచేసే ఓ అమ్మాయి చాలా బాగా పనిచేస్తుంది. సమస్యల్లా భావోద్వేగాలపరంగా ఇతరులపై ఆధారపడుతుంటుంది. ఎప్పుడైనా ఒక కొటేషన్‌, వీడియో అయితే ఫర్లేదు. కానీ తను అస్తమానూ వాట్సాప్‌లో ఈ మెసేజ్‌లు పంపుతూనే ఉంటుంది. అర్ధరాత్రీ ఆగట్లేదు. బంధువులు, స్నేహితులవి అన్నీ కలిపినా తన మెసేజ్‌లన్ని ఉండట్లేదు. విసుగొచ్చి ఫోన్‌ చూడటమే మానేస్తున్నా. ఆఫీసు వాళ్లూ ఏ అవసరమైనా వాట్సాప్‌తోనే నడిపిస్తున్నారు. నేనూ ఓ 20 గ్రూపుల్లో సభ్యురాలిని. వీటిన్నింటినీ సరిగా నిర్వహించుకునే మార్గముందా?

- జోషిక

బంధువులు, ఆఫీస్‌ పనులు, క్లయింట్లు.. ఎవరితోనైనా అందుబాటులో ఉంచే మార్గమిది. చాలామంది వ్యక్తిగత ఫోన్‌నంబర్‌కే వాట్సాప్‌ ఉపయోగిస్తుంటారు. కాబట్టి, వ్యక్తిగతం, పనికి మధ్య సరిహద్దులు ఉండటం లేదు. వారాంతాలు, సెలవులు, పని వేళల తర్వాత.. ఎప్పుడైనా ఆఫీసు వాళ్లతో సంప్రదింపులు జరిపే వీలుంటుంది. అయితే బంధువులకీ, బయటివారికీ ఒక్కటే కాబట్టి, ఫలానా వేళల్లోనే మాట్లాడాలన్న నిబంధన దీనికి వర్తించదు. పొరపాటున సహోద్యోగి క్లయింట్‌కి మీ నంబర్‌ ఇచ్చారనుకోండి. మెసేజ్‌లు వచ్చిపడుతుంటాయి. తర్వాత చూద్దామని పక్కన పెట్టినా.. దాని తాలూకూ నోటిఫికేషన్‌లు మాత్రం కనిపిస్తూనే ఉంటాయి. ఇక సమన్వయం ఎలా అంటే.. ఆఫీసు గ్రూపులో వ్యక్తిగత వివరాలు, స్నేహితులు, కుటుంబాల వాటిల్లో వ్యాపార విషయాలను పెట్టొద్దని చెప్పండి. ధ్రువీకరించని వార్తలు, సమాచారాన్ని పంపొద్దని చెప్పండి. ఇక మీరు.. ఎవరైనా నచ్చలేదా.. ‘మ్యూట్‌’లో పెట్టేయండి. గ్రూపులో ఎవరైనా స్పందించకపోతే కోపమొద్దు. నలుగురిలో మాట్లాడటం నచ్చకపోవచ్చు. వ్యక్తిగతంగా పంపండి. ఫొటో, మీమ్‌ వీడియోలు మీకే కాదు ఇతరులకూ నచ్చేవైతేనే పంచుకోవాలి. గ్రూపులో ఒకరితోనే సంభాషణ జరుగుతోంటే వ్యక్తిగతంగా మాట్లాడటం మేలు. అర్థం తెలియని, వివరణ అవసరమైన చోటా ఎమోజీలు వాడొద్దు. ఈ నియమాలు ప్రయత్నించండి, సాయపడతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్