దాండియా స్టిక్స్‌కి కొత్త హంగులు!

బతుకమ్మ, దసరా అంటేనే దాండియా, గర్బా నృత్యాల కోలాహలం! ఈ నవరాత్రులూ యువతులు, మహిళలు ‘దాండియా ఆటలు ఆడ.. సరదా పాటలు పాడ..’ అంటూ తమ ఆటపాటలతో అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటుంటారు. అయితే ఈ సరదా ఆటల్లో దాండియా....

Published : 25 Sep 2022 13:17 IST

బతుకమ్మ, దసరా అంటేనే దాండియా, గర్బా నృత్యాల కోలాహలం! ఈ నవరాత్రులూ యువతులు, మహిళలు ‘దాండియా ఆటలు ఆడ.. సరదా పాటలు పాడ..’ అంటూ తమ ఆటపాటలతో అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటుంటారు. అయితే ఈ సరదా ఆటల్లో దాండియా స్టిక్స్‌ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంటాయి. ఎందుకంటే చాలామంది అమ్మాయిలు సాధారణ కోలలతో పాటు వివిధ రకాలుగా అలంకరించిన దాండియా స్టిక్స్‌ని ఎంచుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు. వారి అభిరుచులకు తగినట్లుగానే ఏటికేడు ఆకర్షణీయంగా ముస్తాబై అతివల మనసు దోచుకుంటుంటాయివి.

రంగురంగుల లేసులు, గోల్డ్‌ కలర్‌ మెరుపుతో కూడిన లేసులు, ప్రింటెడ్ క్లాత్‌తో చుట్టినవి, చీర మాదిరిగా సగభాగం జరీతో అల్లినవి, ఎనామిల్‌ పెయింట్‌ వేసినవి.. ఇలా విభిన్న రకాలైన దాండియా స్టిక్స్‌ ప్రస్తుతం మార్కెట్లో సందడి చేస్తున్నాయి. అంతేకాదు.. వీటికి చివర్లలో రంగురంగుల పూసలు-కుందన్లు, టాజిల్స్‌, దారాలు వేలాడదీసినవి కూడా అందుబాటులో ఉన్నాయి. మరికొన్ని జతల్లో ఒకదానికి మధ్యలో రంధ్రం ఉండి.. ఆడేటప్పుడు సౌకర్యంగా ఉండేలా వాటిని రూపొందించారు డిజైనర్లు.

అలాగే ఇంకొన్ని రకాల్లో.. ఒక చివర ఫ్లోరసెంట్‌ బల్బులు (క్లాత్‌/లేస్‌ లోపలి వైపు) అమర్చినవి కూడా దొరుకుతున్నాయి. బ్యాటరీ సహాయంతో రూపొందించిన వీటిని కింది వైపున్న స్విచ్‌ సహాయంతో వేసుకోవచ్చు.. పని చేస్తాయివి. అయితే ఈ స్టిక్స్‌తో ఆడేటప్పుడు మాత్రం లైట్లు పగలకుండా జాగ్రత్తపడడం ముఖ్యం. ఇలాంటి కొన్ని విభిన్న, ఆకర్షణీయమైన దాండియా స్టిక్స్‌పై ఓ లుక్కేద్దాం రండి..

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్