ప్రసవం తర్వాత.. వ్యాయామం చేస్తున్నారా?

ప్రసవం తర్వాత వ్యాయామం చేసే క్రమంలో పలు అంశాలు దృష్టిలో పెట్టుకోవాలంటున్నారు నిపుణులు...

Published : 08 Jun 2023 20:57 IST

ప్రసవం తర్వాత వ్యాయామం చేసే క్రమంలో పలు అంశాలు దృష్టిలో పెట్టుకోవాలంటున్నారు నిపుణులు.

వ్యాయామం చేసే క్రమంలో శరీరం డీహైడ్రేట్‌ అవడం సహజం. అందుకే నీళ్లు ఎక్కువగా తాగడం మర్చిపోవద్దు. దీంతో పాటు పండ్ల రసాల వంటివి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.

సాధారణంగా పాలిచ్చే క్రమంలో శరీరంలోని క్యాలరీలు ఖర్చయిపోతాయి. బరువు తగ్గాలన్న ఆతృతతో తీసుకునే ఆహారంలో క్యాలరీలు పూర్తిగా లేకుండా చూసుకోవడం మంచిది కాదు. కాబట్టి రోజుకు తగినన్ని క్యాలరీలుండేలా మీ మెనూను సిద్ధం చేసుకోవాలి. తద్వారా మీరు అలసిపోకుండా ఉండచ్చు.. మీ బిడ్డకూ పోషకాలు అందుతాయి.

వ్యాయామానికి ముందే బిడ్డకు పాలివ్వడం లేదంటే బ్రెస్ట్‌ పంప్‌తో పాలు తీయడం.. వంటివి చేస్తే వర్కవుట్‌ చేసే క్రమంలో అసౌకర్యానికి గురి కాకుండా జాగ్రత్తపడచ్చు.

త్వరగా బరువు తగ్గాలని అధికంగా వ్యాయామం చేయడమూ సరికాదు. దీనివల్ల శరీరంలోని కొవ్వులు రక్తంలో కలిసిపోయి.. ఉత్పత్తయ్యే తల్లిపాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కాబట్టి రోజుకు అరగంట లేదా గంట సేపు వ్యాయామం చేస్తే సరిపోతుందంటున్నారు నిపుణులు.

తీవ్రత తక్కువగా ఉండే వ్యాయామాలతో మొదలుపెట్టి.. క్రమంగా దాన్ని పెంచుకుంటూ పోవడం మంచిది.

ఇలా వ్యాయామంతో పాటు ఇంటి పనుల్నీ స్వయంగా చేసుకోవడం వల్ల శరీరం మరింత యాక్టివ్‌గా మారుతుంది. అయితే ఈ విషయంలో కూడా మీ ఆరోగ్య స్థితిని బట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

ఇక వ్యాయామం చేసే క్రమంలో నొప్పి వేధించినా, అనుకోకుండా మూత్రం లీకైనా, ఇతర అసౌకర్యం కలిగినా.. వెంటనే చేసే వ్యాయామాలు ఆపేసి.. నిపుణుల్ని సంప్రదించి తగిన సలహా తీసుకోవడం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్