మామిడి పండు ఇడ్లీలు!

తియ్యటి మామిడి పండ్లంటే ఇష్టపడని వారుండరు. వేసవిలో మాత్రమే లభించే వీటి కోసం ఏడాదంతా ఎదురుచూస్తుంటాం. అయితే వీటిని నేరుగా, జ్యూస్‌ చేసుకొని తీసుకోవడం కాకుండా.. వీటితో నోరూరించే ఇడ్లీలు కూడా తయారుచేసుకోవచ్చని మీకు తెలుసా? మరి అదెలాగో చూద్దాం రండి..

Published : 18 Apr 2024 13:21 IST

తియ్యటి మామిడి పండ్లంటే ఇష్టపడని వారుండరు. వేసవిలో మాత్రమే లభించే వీటి కోసం ఏడాదంతా ఎదురుచూస్తుంటాం. అయితే వీటిని నేరుగా, జ్యూస్‌ చేసుకొని తీసుకోవడం కాకుండా.. వీటితో నోరూరించే ఇడ్లీలు కూడా తయారుచేసుకోవచ్చని మీకు తెలుసా? మరి అదెలాగో చూద్దాం రండి..

కావాల్సినవి

⚛ మామిడి పండు గుజ్జు- రెండు కప్పులు

⚛ నెయ్యి - రెండు టేబుల్‌స్పూన్లు

⚛ ఇడ్లీ రవ్వ - రెండు కప్పులు

⚛ చక్కెర పొడి - అర కప్పు

⚛ యాలకుల పొడి - అర టీస్పూను

⚛ మిరియాల పొడి - పావు టీస్పూను

⚛ పెరుగు - అర కప్పు

⚛ పాలు - అర కప్పు

⚛ ఉప్పు - రుచికి తగినంత

⚛ జీడిపప్పు - గార్నిష్‌కి సరిపడా

తయారీ

⚛ బాణలిలో రెండు స్పూన్ల నెయ్యి వేసి జీడిపప్పుని దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ నేతిలోనే ఇడ్లీ రవ్వను సన్నని మంట మీద వేయించుకోవాలి.

⚛ ఒక పెద్ద బౌల్‌లో మామిడి పండు గుజ్జు, చక్కెర పొడి, ఉప్పు, పెరుగు, యాలకుల పొడి, మిరియాల పొడి, వేయించిన ఇడ్లీ రవ్వ వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని రెండు గంటల పాటు నానబెట్టాలి.

⚛ రెండు గంటల తర్వాత ఈ పిండిలో కొద్ది కొద్దిగా పాలు పోస్తూ ఇడ్లీ పిండిలా కలుపుకోవాలి.

⚛ ఇడ్లీ పాత్రకు నెయ్యి రాసుకుని పిండి వేయాలి. దోరగా వేయించిన జీడిపప్పు పలుకులను ఇడ్లీ పిండి పైన గార్నిష్ చేసుకోవాలి.

⚛ 20 నిమిషాల పాటు సాధారణ మంటపై ఇడ్లీలను ఉడకనిస్తే ఎంతో రుచిగా ఉండే మామిడి పండు ఇడ్లీ రడీ..! ఐదు నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్