ఎటూ తేల్చుకోలేకపోతున్నా...

ఒకప్పుడు నా స్నేహితురాలిని ప్రేమించిన వ్యక్తి ఇప్పుడు నేనంటే ఇష్టమంటున్నాడు. నాకూ అతనంటే సదభిప్రాయమే. కానీ ఆమె నన్ను అపార్థం చేసుకుంటుందని భయంగా ఉంది. అలాగని అతడిని వదులుకోలేకపోతున్నాను.  ముందు అతనితో మాట్లాడి.. వాళ్లెందుకు విడిపోయారు? ఇద్దరికీ సరిపడలేదా? ఏ విషయంలో విభేదాలొచ్చాయి? మీలో ఏం నచ్చిందో అడగండి.

Published : 06 Feb 2023 00:27 IST

ఒకప్పుడు నా స్నేహితురాలిని ప్రేమించిన వ్యక్తి ఇప్పుడు నేనంటే ఇష్టమంటున్నాడు. నాకూ అతనంటే సదభిప్రాయమే. కానీ ఆమె నన్ను అపార్థం చేసుకుంటుందని భయంగా ఉంది. అలాగని అతడిని వదులుకోలేకపోతున్నాను. 

-ఓ సోదరి

ముందు అతనితో మాట్లాడి.. వాళ్లెందుకు విడిపోయారు? ఇద్దరికీ సరిపడలేదా? ఏ విషయంలో విభేదాలొచ్చాయి? మీలో ఏం నచ్చిందో అడగండి. నువ్వు ఇష్టపడినామె నాకు స్నేహితురాలు కనుక.. అపార్థం చేసుకోవచ్చు.. వివరాలు తెలుసుకోవడం అవసరమని చెప్పండి. ఇవన్నీ ప్రస్తావించడం వల్ల ఆ మాటతీరుని బట్టి నిజాయతీగా ఉన్నాడో, అబద్ధాలు చెబుతున్నాడో అర్థమైపోతుంది. మీ మనసులో ఉన్న ఆందోళన.. అన్నీ చర్చించండి. ఆమెతో సరిపడలేదు, మీతో అనుకూలంగా ఉంటుంది అని చెబితే.. వాటిలో ఎంత నిజముందో ఆలోచించండి. మీ ఇద్దరికీ కలిసే గుణాలేంటో చూడండి. ఆమెని కూడా ఎందుకు విడిపోయారో అడగండి. అలా అతని గుణగణాలు, మనస్తత్వం అర్థమవుతాయి. ‘మా ఇద్దరికీ పడలేదు కానీ అతను మంచివాడే’ అని చెబుతుందేమో! లేదా అతను నమ్మదగ్గ వ్యక్తి కాదంటుందో.. మొత్తానికి ఒక స్పష్టత వస్తుంది. అతను నిజంగానే ఇష్టపడుతున్నాడా, మరేదైనా ఉద్దేశముందో తెలుస్తుంది. త్వరపడి అడుగేయొద్దు. భవిష్యత్తులో ఇబ్బందులు రాకూడదంటే అన్నీ కనుక్కోండి. సరేననుకుంటే కుటుంబసభ్యులతో మాట్లాడండి. అతడితో మీకు పొసగుతుందో లేదో వాళ్లు కూడా ఆరాతీస్తారు. ఇలా మూడు మార్గాల్లో కనుక్కోవడం వల్ల అతని గురించి సంపూర్ణంగా తెలుస్తుంది. జీవితాంతం కలిసుండాల్సిన వ్యక్తి కనుక అతను మళ్లీ మనసు మార్చుకుంటే కష్టమని మర్చిపోవద్దు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్