హాస్టల్లో.. ఏంటివి?

పల్లెటూరి నుంచి వచ్చినందున మీకు సాధారణ జీవితం గడపటం అలవాటైంది. మరే ఆలోచనలూ లేకుండా నిర్మలంగా ఉండి చదువుమీదే ధ్యాసపెట్టాలనుకున్నారు. పల్లె చిన్నది కనుక అంతా మనల్ని గమనిస్తారు, కష్టసుఖాలు తెలుసుకుంటారు. అందువల్ల అక్కడ చెడు అలవాట్లకు పోయే అవకాశం ఉండదు. ఏదైనా తేడా అనిపించినా చుట్టుపక్కలవారు సరిచేస్తారు.

Published : 13 Mar 2023 00:28 IST

మాది పల్లెటూరు. హాస్టల్లో ఉంటున్నాను. ఇక్కడి పరిస్థితులు చూస్తుంటే భయమేస్తోంది. నా రూమ్మేట్స్‌ అర్ధరాత్రి వరకూ ప్రేమికులతో ఫోన్లో మాట్లాడుతూనే ఉంటారు. ఒకామె బ్రేకప్‌ అయిందంటూ మందు తాగుతోంది. కొందరమ్మాయిలు సిగరెట్లు.. ఇక్కడి నుంచి పారిపోవాలనిపిస్తోంది..

- ఒక సోదరి

ల్లెటూరి నుంచి వచ్చినందున మీకు సాధారణ జీవితం గడపటం అలవాటైంది. మరే ఆలోచనలూ లేకుండా నిర్మలంగా ఉండి చదువుమీదే ధ్యాసపెట్టాలనుకున్నారు. పల్లె చిన్నది కనుక అంతా మనల్ని గమనిస్తారు, కష్టసుఖాలు తెలుసుకుంటారు. అందువల్ల అక్కడ చెడు అలవాట్లకు పోయే అవకాశం ఉండదు. ఏదైనా తేడా అనిపించినా చుట్టుపక్కలవారు సరిచేస్తారు. కానీ పట్టణాల్లో ఒకరి గురించి ఒకరు పట్టించుకోరు. ఎవరికిష్టం వచ్చినట్టు వారుంటారు. కొందరు స్వేచ్ఛ ఎక్కువవడం వల్ల రిలేషన్‌షిప్స్‌ పెట్టుకుంటారు. నాగరికత అనుకుని సిగరెట్లు, డ్రింక్స్‌ లాంటివి అలవాటు చేసుకుంటారు. బాధ్యతలు మర్చిపోయి విశృంఖల స్వభావాన్ని అలవరచుకుంటారు. అలాంటివారి మధ్య గడపాల్సి రావడం బాధాకరమే. వాళ్లు చేస్తోంది తప్పు, అలా ఉండకూడదని మీకు స్పష్టంగా తెలుస్తోంది. మీ స్వభావానికి పూర్తిగా వ్యతిరేకమైన వాతావరణంలో గడపటం క్షోభ కలిగించే మాట వాస్తవమే. వాళ్లని మీరు మార్చలేరు కనుక స్నేహితుల సహకారంతో వేరే హాస్టల్లో ఉండండి. లేదంటే మీ మనస్తత్వానికి సరిపోయే ఇద్దరు ముగ్గురు అమ్మాయిలతో కలిసి ఒక పోర్షన్‌ అద్దెకు తీసుకుని ఉండండి. అప్పుడు ధైర్యంగా ఉంటుంది. బంధుమిత్రులు లేదా లెక్చరర్ల సాయంతో పరిస్థితుల్లో మార్పు తెచ్చుకునేందుకు ప్రయత్నించండి. అంతే తప్ప ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు. వ్యక్తిత్వాన్నీ, ఆశలూ ఆశయాలను మార్చుకోవద్దు.  ముందు ఈ విషయాన్ని అమ్మానాన్నలతో చర్చిస్తే ఏం చేయొచ్చో సూచించి సాయం చేస్తారు. ఒకవేళ అక్కణ్ణించి మారే అవకాశం లేకపోతే వాళ్లను పట్టించుకోకుండా మీ చదువు, లక్ష్యాల మీద ధ్యాస పెట్టండి. హాస్టల్‌ను రాత్రి పడుకోవడానికే వినియోగించండి. ఇతర సమయాల్లో కాలేజీలోనో, లైబ్రరీలోనో కూర్చుని చదువుకోండి. హాస్టలుకు రాగానే భోజనం చేసి పడుకోండి. అలా వాళ్లతో వీలైనంత తక్కువ సమయం గడపటం వల్ల మీ మనశ్శాంతి హరించదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్