డ్రైఫ్రూట్స్‌ అన్నీ ఒకే చోట!

జీడిపప్పు, బాదం పప్పు, కిస్‌మిస్‌, కొన్ని రకాల గింజలు.. ఇంట్లో స్వీట్లు, కేక్స్‌, కొన్ని రకాల హెల్దీ డ్రింక్స్‌ తయారుచేసుకోవాలంటే ఎప్పుడూ ఇవి అందుబాటులో ఉండాల్సిందే! అయితే చాలామంది వీటిని వేర్వేరు డబ్బాల్లో నిల్వ చేస్తుంటారు.. కొంతమంది ప్యాకెట్లలోనే ఉంచి అవసరమొచ్చినప్పుడు తీసి వాడుతుంటారు.

Published : 20 Apr 2024 18:16 IST

జీడిపప్పు, బాదం పప్పు, కిస్‌మిస్‌, కొన్ని రకాల గింజలు.. ఇంట్లో స్వీట్లు, కేక్స్‌, కొన్ని రకాల హెల్దీ డ్రింక్స్‌ తయారుచేసుకోవాలంటే ఎప్పుడూ ఇవి అందుబాటులో ఉండాల్సిందే! అయితే చాలామంది వీటిని వేర్వేరు డబ్బాల్లో నిల్వ చేస్తుంటారు.. కొంతమంది ప్యాకెట్లలోనే ఉంచి అవసరమొచ్చినప్పుడు తీసి వాడుతుంటారు. దీనివల్ల ఒక్కోసారి ఒక్కో డ్రైఫ్రూట్స్‌ బాక్స్‌ దొరక్కపోవచ్చు.. పైగా ఒక్కో బాక్స్‌ శుభ్రం చేయడం పెద్ద పని కూడా! అదే డ్రైఫ్రూట్స్‌ అన్నీ ఒకే డబ్బాలో అమర్చితే? అదెలా సాధ్యం అనుకుంటున్నారా? మార్కెట్లో అందుబాటులో ఉన్న ‘రొటేటింగ్‌ డ్రైఫ్రూట్స్‌ బాక్స్‌’ కొనేస్తే సరి!

అచ్చం పోపుల డబ్బాను పోలి ఉండే ఈ బాక్స్‌లు సింగిల్‌ లేయర్‌, డబుల్‌ లేయర్లలో దొరుకుతున్నాయి. ఈ లేయర్లలో చిన్న చిన్న అరలు అమరి ఉంటాయి. పైభాగంలో ఉన్న గుండ్రటి హ్యాండిల్‌ని తిప్పడం వల్ల ఆ అరలు తెరుచుకోవడం, మూసుకోవడం జరుగుతుంది. ఇక వీటిలో ఒక్కో అరలో ఒక్కో రకం డ్రైఫ్రూట్స్‌/గింజల్ని అమర్చుకుంటే.. అన్నీ ఒకే చోట ఉంటాయి.. అవసరమైనప్పుడు సులభంగా వాడుకోవచ్చు.. నిండుకునే కొద్దీ తిరిగి నింపుకోవచ్చు. ఒక కొన్ని డ్రైఫ్రూట్స్‌ బాక్సులతో పాటు స్పూన్లు కూడా అందిస్తున్నారు. అలాంటి విభిన్న రొటేటింగ్‌ డ్రైఫ్రూట్స్‌ బాక్స్‌లపై మీరూ ఓ లుక్కేసేయండి!

Photos: Amazon.in

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్