‘మసాజ్‌’ చేసుకుందాం.. స్వయంగా!

మసాజ్‌ చేయించుకోవాలంటే స్పాకే వెళ్లాలా? ఇంట్లో చేసుకున్నా ఇతరుల సహాయం తీసుకోవాలా? అంటే.. ఆ అవసరం లేదంటూ మన ముందుకొచ్చాయి ‘సెల్ఫ్‌ మసాజ్‌ రోలర్స్‌’.

Published : 01 Dec 2023 13:36 IST

మసాజ్‌ చేయించుకోవాలంటే స్పాకే వెళ్లాలా? ఇంట్లో చేసుకున్నా ఇతరుల సహాయం తీసుకోవాలా? అంటే.. ఆ అవసరం లేదంటూ మన ముందుకొచ్చాయి ‘సెల్ఫ్‌ మసాజ్‌ రోలర్స్‌’. చర్మం కింద పేరుకున్న కొవ్వును కరిగించుకోవడానికి, రక్తప్రసరణ మెరుగుపడి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి, శారీరక నొప్పుల నివారణకు.. ఇలా ఈ మసాజ్‌ రోలర్స్‌తో బోలెడన్ని ప్రయోజనాలు చేకూరతాయి.

చేతిలో పట్టుకోవడానికి హ్యాండీగా ఉండేలా, స్టిక్‌ తరహాలో ఉన్నవి, వంపులు తిరిగిన శరీర భాగాల్లో మర్దన చేసుకోవడానికి వీలుగా ఉండేలా కర్వ్‌డ్‌ ఆకృతిలో రూపొందించినవి, మెడపై సుతారంగా మర్దన చేసుకోవడానికి తయారుచేసిన ప్రత్యేక నెక్‌ మసాజర్స్‌, చేతికి అమర్చుకొని మర్దన చేసుకునే మసాజర్‌ గ్లోవ్‌, పాదాలు/అరికాళ్లలో మసాజ్‌ కోసం డిజైన్‌ చేసిన ఫుట్‌ మసాజ్‌ రోలర్‌, ఒకేసారి మూడువైపులా మర్దన చేసుకునేందుకు వీలుగా ఉండేలా ‘U’ ఆకృతిలో డిజైన్‌ చేసిన మసాజర్‌ టూల్‌, వీపు/వెన్నెముక.. వంటి మనకు అందని భాగాల్లోనూ సులువుగా మసాజ్‌ చేసుకునేందుకు వీలుగా రూపొందించిన రోలర్‌ రోప్‌.. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని సెల్ఫ్‌ మసాజ్‌ రోలర్స్‌ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

వీటిలోనూ కొన్ని బాల్స్‌ రూపంలో ఉంటే.. మరికొన్ని బొడిపెలతో కూడిన బాల్స్‌ రూపంలో లభ్యమవుతున్నాయి.. చెక్కతో చేసినవీ దొరుకుతున్నాయి. ఈ టూల్స్‌ని ఉపయోగించి శరీరంలో ఎక్కడంటే అక్కడ సులువుగా మసాజ్‌ చేసుకోవచ్చు. మరి, హ్యాండీగా ఉంటూనే, బహుళ ప్రయోజనాల్ని అందించే ఈ సెల్ఫ్‌ మసాజ్‌ రోలర్స్‌పై మీరూ ఓ లుక్కేయండి!

Photos: Amazon.in

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్