వేసవిలో.. ఇల్లు చల్లగా!

ఈసారి మార్చిలోనే ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ముందు ముందు వేడిని తట్టుకునేలా ఇంట్లో పలు మార్పులు చేర్పులు చేసుకోవడం తప్పనిసరి! ఎంత ఏసీలు, కూలర్లు వాడుతున్నా సరే- ఫర్నిచర్ దగ్గరి నుంచి గుమ్మాలకు వేసే కర్టెన్ల దాకా.. ఇంట్లోకి వేడి ప్రవేశించకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలి.

Published : 28 Mar 2024 13:15 IST

ఈసారి మార్చిలోనే ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ముందు ముందు వేడిని తట్టుకునేలా ఇంట్లో పలు మార్పులు చేర్పులు చేసుకోవడం తప్పనిసరి! ఎంత ఏసీలు, కూలర్లు వాడుతున్నా సరే- ఫర్నిచర్ దగ్గరి నుంచి గుమ్మాలకు వేసే కర్టెన్ల దాకా.. ఇంట్లోకి వేడి ప్రవేశించకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే వేసవి తాపాన్ని తట్టుకోగలుగుతాం. మరి దానికోసం ఇంట్లో చేసుకోవాల్సిన మార్పులు చేర్పులేంటో తెలుసుకుందాం రండి..

ఫర్నిచర్ ఇలా..

ఇల్లు చల్లగా ఉండాలని ఇప్పటికిప్పుడు పాత ఫర్నిచర్ మార్చేసి కొత్త ఫర్నిచర్ కొనక్కర్లేదు. ఇప్పటికే ఇంట్లో ఉన్న ఫర్నిచర్‌ను కూడా వేసవి వేడిని తట్టుకొనే విధంగా మార్చేసుకోవచ్చు. కొంతమంది సోఫా, కుషన్ కవర్లు, మంచంపై దుప్పట్లు.. ఇలా వీటన్నింటినీ ఎక్కువగా ముదురు రంగులో ఉన్న వాటినే ఉపయోగిస్తారు. కానీ వేసవిలో మాత్రం వీటికి బదులుగా లేత రంగుల్లో ఉన్న సోఫా కవర్లు, బెడ్‌షీట్లనే ఎంచుకోవాలి. ఎందుకంటే ఇవి వేడిని ఎక్కువగా గ్రహించవు. కాబట్టి.. ఇల్లు కాస్త చల్లగా ఉంటుంది. అలాగే వీటిలోనూ సిల్క్ తరహావి కాకుండా.. నూలువి ఎంచుకొంటే సౌకర్యంగా ఉంటుంది.

కుచ్చుల కర్టెన్లు వద్దు..

ఇల్లు అందంగా కనిపిస్తుందనే ఉద్దేశంతో.. కొంతమంది కిటికీలకు, తలుపులకు కుచ్చులుగా ఉండే కర్టెన్లను (డ్రేపరీ తరహా) ఉపయోగిస్తుంటారు. ఇవి మందంగా ఉండటం వల్ల లోపలికి గాలి సరిగా రాదు. ఫలితంగా.. ఇల్లు వేడెక్కే అవకాశం ఉంది. అందుకే.. వేసవిలో మాత్రం పల్చటి కర్టెన్లను ఉపయోగించాలి. ఇవి తేలికగా ఉండటంతో పాటు.. లోపలికి గాలి ప్రసరించేలా చేస్తాయి. దీనికోసం కూడా ముదురు రంగులను కాకుండా.. లేత రంగులనే ఎంచుకోవడం మంచిది. ఇక కర్టెన్లకు బదులుగా విండో వ్యాలన్సెస్‌ ఉపయోగించినా ఇంట్లోకి ఎండ పడకుండా జాగ్రత్తపడచ్చు.

పచ్చదనంతో కూల్‌గా!

వేసవిలో ఇంటిని చల్లగా ఉంచుకోవాలంటే.. గదుల్లో అక్కడక్కడా మొక్కలను పెంచాలి. ఇవి వేసవి తాపాన్ని తగ్గించడంతో పాటు ఇంటి లోపల ఆక్సిజన్ స్థాయుల్ని పెంచుతాయి. దీనికోసం.. కలబంద, స్నేక్ ప్లాంట్, బేబీ రబ్బర్ ప్లాంట్, గోల్డెన్ పాటోస్.. వంటి ఇండోర్‌ ప్లాంట్స్ ఎంచుకోవాలి. నీడలో పెరిగే పూల మొక్కలను సైతం ఇంట్లో అక్కడక్కడా ఏర్పాటుచేసుకోవచ్చు. తద్వారా ఇల్లు పరిమళ భరితంగా మారుతుంది. మీరు రోజులో ఎక్కువ సమయం ఒకేచోట ఉండటానికి ప్రాధాన్యమిస్తే.. ఆ ప్రదేశంలో మొక్కలు ఎక్కువగా ఉండేలా చూసుకోవడం మంచిది. మొక్కల వల్ల ఇల్లు అందంగా ఉండటంతో పాటు చల్లగానూ మారుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్