ఈ డ్రింక్‌తో వేసవి వేడిని తరిమేయండి!

ఎండలు మండిపోతున్నాయ్! ఈ తరుణంలో వేడిని తరిమికొట్టి, శరీరానికి చలువనిచ్చే ఆహార పదార్థాలు, పానీయాలు తీసుకోవడం మామూలే. మరి, డ్రింక్స్ విషయానికొస్తే.. మజ్జిగ, కొబ్బరి నీళ్లు, చెరుకురసం.. వంటివి తీసుకుంటుంటాం.

Published : 25 Apr 2024 13:07 IST

ఎండలు మండిపోతున్నాయ్! ఈ తరుణంలో వేడిని తరిమికొట్టి, శరీరానికి చలువనిచ్చే ఆహార పదార్థాలు, పానీయాలు తీసుకోవడం మామూలే. మరి, డ్రింక్స్ విషయానికొస్తే.. మజ్జిగ, కొబ్బరి నీళ్లు, చెరుకురసం.. వంటివి తీసుకుంటుంటాం. అయితే వీటితో పాటు ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోగలిగే, తక్షణమే శరీరానికి చల్లదనాన్ని అందించే 'పుదీనా జల్ జీరా డ్రింక్'ని మీరెప్పుడైనా ట్రై చేశారా? మరింకెందుకాలస్యం.. దాన్నెలా తయారుచేయాలో తెలుసుకుందాం రండి..

కావాల్సినవి

⚛ పుదీనా ఆకులు - అర కప్పు

⚛ నిమ్మరసం - 6 టేబుల్ స్పూన్లు

⚛ నల్ల ఉప్పు - 2 టీ స్పూన్లు

⚛ నీళ్లు - 8 కప్పులు

⚛ జీలకర్ర - 2 టేబుల్ స్పూన్లు (వేయించుకోవాలి)

⚛ కొత్తిమీర - అర కప్పు

⚛ అల్లం తురుము - 2 టేబుల్ స్పూన్లు

⚛ చక్కెర - 4 టేబుల్ స్పూన్లు

⚛ చింతపండు గుజ్జు - 2 టేబుల్ స్పూన్లు

⚛ ఉప్పు - టీ స్పూన్

⚛ ఐసు ముక్కలు - సర్వింగ్స్‌కి సరిపడా

తయారీ

ముందుగా పుదీనా, కొత్తిమీర శుభ్రంగా కడిగి, సన్నగా తరుక్కోవాలి. వీటన్నింటినీ ఒక బౌల్‌లోకి తీసుకొని, అందులో చింతపండు గుజ్జు, వేయించిన జీలకర్ర, అల్లం తురుము వేసి బాగా కలుపుకోవాలి. వీటిని మిక్సీ జార్‌లోకి తీసుకొని, అందులో ఉప్పు, నల్ల ఉప్పు, చక్కెర, నిమ్మరసం, నాలుగు కప్పుల నీళ్లు పోసి పదార్థాలన్నీ బాగా బ్లెండ్ అయ్యేలా.. జ్యూస్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బౌల్‌లో వడకట్టుకొని మిగిలిన పిప్పిని పడేయాలి. ఈ రసంలో మిగతా నాలుగు కప్పుల నీళ్లు కూడా పోసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని గాజు గ్లాసుల్లో పోసుకొని.. ఐస్ క్యూబ్స్ వేసి, నిమ్మచెక్కలు-పుదీనాతో గార్నిష్ చేసుకొని, సర్వ్ చేస్తే ఎంతో రుచిగా, చల్లచల్లగా ఉండే 'పుదీనా జల్ జీరా డ్రింక్' సిద్ధం..!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్