వీటిని ఇలా కూడా వాడచ్చు!

ఆలివ్ నూనె.. పెట్రోలియం జెల్లీ.. మొదలైన వాటిని సౌందర్య సంరక్షణలో ఉపయోగిస్తాం. ఇలా ఇంట్లో ఉండే వివిధ రకాల వస్తువులు, పదార్థాలను ఆయా పనుల కోసం వినియోగిస్తుంటాం. కానీ వీటిని ఇలా కాకుండా ఇతర పనుల కోసం కూడా వినియోగించచ్చన్న విషయం మీకు తెలుసా? అవును.. అలాంటి వస్తువులు మనింట్లో....

Updated : 20 Dec 2022 21:55 IST

ఆలివ్ నూనె.. పెట్రోలియం జెల్లీ.. మొదలైన వాటిని సౌందర్య సంరక్షణలో ఉపయోగిస్తాం. ఇలా ఇంట్లో ఉండే వివిధ రకాల వస్తువులు, పదార్థాలను ఆయా పనుల కోసం వినియోగిస్తుంటాం. కానీ వీటిని ఇలా కాకుండా ఇతర పనుల కోసం కూడా వినియోగించచ్చన్న విషయం మీకు తెలుసా? అవును.. అలాంటి వస్తువులు మనింట్లో చాలానే ఉంటాయి. ఇంతకీ అవేంటి.. వాటిని ఎలా వాడాలి.. అని ఆలోచిస్తున్నారా? ఇదిగో ఇలా..!

తలుపులు, కిటికీలు, అల్మరాలు.. వంటివి వాటి జాయింట్స్‌ దగ్గర మృదుత్వాన్ని కోల్పోయి.. వేస్తుంటే, తీస్తుంటే అదో రకమైన శబ్దం వినిపిస్తుంటుంది. అలాంటప్పుడు కాస్త పెట్రోలియం జెల్లీని ఆ జాయింట్స్‌ దగ్గర పూసి చూడండి.

వంటింట్లో ఉండే స్పూన్లు.. కంటి అలసటను తగ్గించడానికీ ఉపయోగపడతాయి. ఇందుకోసం ఒక చెంచాను రాత్రంతా ఫ్రిజ్‌లో పెట్టేయండి. ఉదయాన్నే ఆ చెంచాను కంటిపై పెట్టుకొని కాసేపు ఉండండి. ఇలా చేయడం వల్ల అలసిన కళ్లకు సాంత్వన చేకూరుతుంది. అలాగే కళ్ల దగ్గర వాపు కూడా కనుమరుగవుతుంది.

అటు ఆరోగ్యానికి, ఇటు సౌందర్య పోషణలో ఉపయోగపడే ఆలివ్‌ నూనె చెక్క వస్తువుల్ని మెరిపించడానికీ ఉపయోగపడుతుంది. ఇందుకోసం ఒక డస్టర్‌పై కాస్త ఆలివ్‌ నూనె వేసి ఆయా వస్తువుల్ని తుడిచేస్తే తేడా మీకే తెలుస్తుంది.

ఒక్కోసారి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కను నేరుగా ఫ్రిజ్‌లో పెట్టేస్తుంటాం. అది అలా ఎక్కువసేపు ఉంటే విషపూరితమవుతుంది.. అలాగే వడలిపోతుంది కూడా! అదే ఆ కట్‌ చేసిన లేయర్‌పై కాస్త ఛీజ్‌ పూసి చూడండి.. ఎక్కువ సమయం తాజాగా ఉండడంతో పాటు విషపూరితం కాకుండా జాగ్రత్తపడచ్చు.

పిల్లలకు మసాజ్‌ చేసే బేబీ ఆయిల్‌ని సౌందర్య పోషణలో వాడుతుంటాం. అయితే అదే ఆయిల్‌ని ఇరుక్కుపోయిన జిప్పర్స్‌ని మృదువుగా చేయడానికి కూడా ఉపయోగించచ్చు. అందుకోసం కొన్ని చుక్కల బేబీ ఆయిల్‌ని జిప్‌పై వేసి కాసేపు అలాగే ఉంచితే జిప్‌ ఈజీగా అటూ ఇటూ కదులుతుంది.

వంటింట్లో ఎన్నో రకాలుగా ఉపయోగపడే బేకింగ్‌ సోడా.. దుస్తుల్ని మెరిపించడానికీ వాడచ్చు. ఇందుకోసం బట్టలు ఉతికేటప్పుడు ఉపయోగించే డిటర్జెంట్‌ పౌడర్‌లో కొద్దిగా బేకింగ్‌ సోడాను కలిపి చూడండి.

హెయిర్‌స్ప్రే జుట్టునే కాదు.. షూస్‌ని కూడా మెరిపిస్తుంది. అదెలాగంటే.. పాలిష్‌ చేసిన షూస్‌పై కాస్త హెయిర్‌స్ప్రేను స్ప్రే చేసి చూడండి. అలాగే దుస్తులు, ఫర్నిచర్‌పై పడిన సిరా మరకల్ని సైతం ఇది తొలగిస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్