ప్రెషర్‌ కుక్కర్‌లో.. ఇవి వద్దు!

ప్రెషర్ కుక్కర్.. దీని సహాయంతో వివిధ వంటకాలను సులభంగా వండేయచ్చు. అయితే కొన్ని రకాల వంటకాలను ప్రెషర్ కుక్కర్‌లో వండడం వల్ల అవి రుచి కోల్పోవడమే కాకుండా.. పలు ఆరోగ్య సమస్యలూ వస్తాయంటున్నారు నిపుణులు.

Updated : 05 Jun 2024 12:33 IST

ప్రెషర్ కుక్కర్.. దీని సహాయంతో వివిధ వంటకాలను సులభంగా వండేయచ్చు. అయితే కొన్ని రకాల వంటకాలను ప్రెషర్ కుక్కర్‌లో వండడం వల్ల అవి రుచి కోల్పోవడమే కాకుండా.. పలు ఆరోగ్య సమస్యలూ వస్తాయంటున్నారు నిపుణులు. మరి, అవేంటో తెలుసుకుందామా...

ఇవి వద్దు!

ఎలక్ట్రిక్‌ రైస్‌ కుక్కర్లు వచ్చినా.. ఇప్పటికీ కొంతమంది ప్రెషర్ కుక్కర్‌లో అన్నం వండుతుంటారు. అయితే ఇది ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే బియ్యంలో స్టార్చ్ ఎక్కువగా ఉంటుంది. ప్రెషర్ కుక్కర్‌లో అన్నం వండినప్పుడు ఈ స్టార్చ్ హానికరమైన రసాయనాలను విడుదల చేస్తుంది. దానివల్ల పలు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. అందుకే ప్రెషర్ కుక్కర్‌కు బదులు సాధారణ గిన్నెలోనే అన్నం వండుకోవడం మేలంటున్నారు. అన్నంతో పాటు స్టార్చ్‌ ఎక్కువగా ఉన్న బంగాళాదుంపలు, పాస్తా, నూడుల్స్‌.. వంటివీ ప్రెషర్‌ కుక్కర్‌లో వండకూడదంటున్నారు.

పాలు-పెరుగు

కొన్ని కూరల్లో గ్రేవీ కోసం పాలు, పెరుగు పోసి వండడం మనకు అలవాటే! అయితే ఇలాంటి వంటకాల్ని కూడా ప్రెషర్‌ కుక్కర్‌లో వండడం మంచిది కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే కుక్కర్‌లోని అధిక వేడి, ఒత్తిడికి పాలు విరిగిపోయే అవకాశం ఉంటుంది. అంతేకాదు.. కూర రుచి కూడా దెబ్బతింటుంది. ఇలాంటివి తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం!

త్వరగా ఉడికేవి!

త్వరగా ఉడకని పప్పులు, మటన్‌.. వంటి పదార్థాల కోసమే ఎక్కువ మంది ప్రెషర్‌ కుక్కర్‌ని వాడుతుంటారు. కానీ కొంతమంది ఆకుకూరలు, వంకాయ, బ్రకలీ, క్యాలీఫ్లవర్‌.. వంటి త్వరగా ఉడికే వాటికీ ప్రెషర్‌ కుక్కర్‌ వాడుతుంటారు. అయితే దీనివల్ల అందులో ఉత్పత్తయ్యే అధిక వేడికి ఆయా కాయగూరలు, ఆకుకూరల్లోని పోషకాలు నశిస్తాయి. అలాగే అవి వాటి సాధారణ రంగు, రుచిని కూడా కోల్పోతాయి. కాబట్టి ఇదీ ఆరోగ్యానికి శ్రేయస్కరం కాదు.

బేకింగ్‌ కోసం..!

అవెన్‌ లేని వారు కేక్స్‌, కుకీస్‌.. వంటి బేకింగ్‌ ఉత్పత్తులు తయారుచేయడానికి ప్రెషర్‌ కుక్కర్‌ని వాడుతుంటారు. దీనివల్ల అవి అంత మృదువుగా రాకపోగా.. వాటి టెక్స్చర్‌, రుచి దెబ్బతింటాయి. కుక్కర్‌ని బేకింగ్‌కి అనువుగా తయారుచేయకపోవడమే ఇందుకు కారణమట!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్