అమ్మ నుంచి నేర్చుకుని.. ఆఫీస్‌లో పాటిస్తే..!
పెరిగి పెద్దయ్యే క్రమంలో తల్లిదండ్రుల నుంచి బోలెడన్ని విషయాలు నేర్చుకుంటాం. ఎవరితో ఎలా మెలగాలి? నలుగురిలో ఎలా ప్రవర్తించాలి? కలుపుగోలుగా ఉండడం, గౌరవమర్యాదలు ఇచ్చిపుచ్చుకోవడం.. ఇలా వాళ్ల పెంపకం మనల్ని ఓ వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది.

పెరిగి పెద్దయ్యే క్రమంలో తల్లిదండ్రుల నుంచి బోలెడన్ని విషయాలు నేర్చుకుంటాం. ఎవరితో ఎలా మెలగాలి? నలుగురిలో ఎలా ప్రవర్తించాలి? కలుపుగోలుగా ఉండడం, గౌరవమర్యాదలు ఇచ్చిపుచ్చుకోవడం.. ఇలా వాళ్ల పెంపకం మనల్ని ఓ వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది. కానీ వాళ్ల నుంచి వృత్తిపరంగా కూడా బోలెడన్ని విషయాల్ని నేర్చుకోవచ్చంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో.. ఉద్యోగం చేసే అమ్మల నుంచే కాదు.. ఇంట్లో ఉండే తల్లుల నుంచి సైతం గ్రహించిన కొన్ని అంశాల్ని తమ పనిలోనూ అమలు పరిస్తే కెరీర్‌లో అభివృద్ధి సాధించచ్చని చెబుతున్నారు.
నిరాశ చెందకుండా..
ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే దాకా ఇంట్లో అమ్మ ఎన్నో పనులు చేస్తుంది. అయితే ఇదంతా కుటుంబ సభ్యుల మెప్పు పొందడానికి కాదు.. ఇల్లు నీట్‌గా ఉంచుకోవాలని.. భర్త, పిల్లలకు సకల సౌకర్యాలు సమకూర్చాలని ఆరాటపడుతుంది. ఇందుకోసం తాను పడిన కష్టాన్ని మర్చిపోయి.. ఒక రకమైన సంతృప్తిని పొందుతుంది. ఉద్యోగం చేసే వారూ తమ తల్లుల నుంచి ఈ విషయాన్ని నేర్చుకోవాలంటున్నారు నిపుణులు. పని ప్రదేశంలో మనం చేసే అన్ని పనులకు పైఅధికారుల ప్రశంసలు దక్కచ్చు.. దక్కకపోవచ్చు.. ఇలాంటప్పుడు నిరాశ చెందకుండా మన పనుల్ని మనం కచ్చితత్వంతో చేసుకుపోవాలి. ఈ క్రమంలో మనసు సంతృప్తి పడుతుంది.. ఇదే ఉత్సాహంతో తర్వాతి పని మీద దృష్టి పెడతాం. ఇలా అమ్మ నుంచి నేర్చుకున్న ఈ సూత్రం కెరీర్ అభివృద్ధికి దోహదం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

సమర్థంగా..
తను చేసే పనులే కాదు.. భర్త, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు వదిలేసిన పనుల్నీ సమర్థంగా పూర్తి చేస్తుంటుంది అమ్మ. ఇల్లు సర్దడం, వంట చేయడం, అందంగా అలంకరించడం.. ఇలా ఏ పనిలోనూ అమ్మకు వంక పెట్టలేం. ఇలా అమ్మలాగే మనమూ ఆఫీస్‌లో బాధ్యతల్ని సమర్థంగా, సంపూర్ణంగా నిర్వర్తించాలంటున్నారు నిపుణులు. ఏ పని ఎంచుకున్నా మధ్యలో వదిలేయకుండా కచ్చితత్వంతో పూర్తి చేస్తే ఎవరూ వేలెత్తి చూపలేరు. అలాగే ఆఫీస్‌లో మీపై ఎవరైనా నెగెటివ్ ప్రచారం చేసినా.. వాటిని మీ పనితనంతో తిప్పికొట్టచ్చు.. తద్వారా పైఅధికారుల మెప్పు పొంది కెరీర్‌లో అభివృద్ధి సాధించచ్చు..
ఓపిక ఉండాలి!
మహిళకు భూదేవికి ఉన్నంత ఓపిక ఉంటుందంటారు. అందులోనూ తన జీవితంలో ఎన్నో సవాళ్లు, సమస్యల్ని దాటొచ్చిన అమ్మ.. ఈ విషయంలో నాలుగాకులు ఎక్కువే చదివిందని చెప్పాలి. ఎందుకంటే తాను ఏ పని చేసినా ఆలోచించే చేస్తుంది.. ఓపికతో ఇంటిని, పిల్లల్ని చక్కదిద్దుతుంది. ఇలా అమ్మలో ఉండే ఈ గుణాన్నే స్ఫూర్తిగా తీసుకోవాలంటున్నారు నిపుణులు. అప్పగించిన పనుల్ని ఆదరాబాదరాగా పూర్తి చేయడం కాకుండా.. ఓపిగ్గా వ్యవహరిస్తే దాన్ని సమర్థంగా పూర్తి చేసే సృజనాత్మక ఆలోచనలు బోలెడన్ని వస్తాయి. వాటిని పనిలో పెడితే మంచి ఉత్పాదకతను అందించచ్చు. ఇది ప్రత్యక్షంగా సంస్థ అభివృద్ధికి, పరోక్షంగా మన కెరీర్ ఉన్నతికి దోహదం చేస్తుంది.

ప్రోత్సహిస్తూ..!
ఎదుటివారు పనులు సమర్థంగా పూర్తిచేసినా, తద్వారా బాస్ మెప్పు పొందినా కొంతమంది సహించలేరు. కానీ ఇలాంటి ప్రతికూల ఆలోచనల్ని పక్కన పెట్టి విజయం సాధించిన సహోద్యోగుల్ని ప్రసించడం, కింది స్థాయి ఉద్యోగుల్ని ప్రోత్సహించడం ఉద్యోగికి ఉండాల్సిన మంచి లక్షణం అంటున్నారు నిపుణులు. ఇంట్లో తల్లి తన పిల్లల్ని ఎలాగైతే ప్రతి విషయంలో ప్రోత్సహిస్తుందో, ఏదైనా సాధిస్తే ప్రశంసిస్తుందో.. అదేవిధంగా పని ప్రదేశంలో సహోద్యోగులతో కూడా ఇలాగే మెలగాలంటున్నారు నిపుణులు. ఈ సానుకూల దృక్పథమే ఇటు మీరు కెరీర్‌లో ఎదిగేలా.. అటు మరింతమందిని తీర్చిదిద్దేలా ఉన్నత స్థానంలో నిలబెడుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
    
    
    బ్యూటీ & ఫ్యాషన్
- చర్మం రిపేర్ చేశారా?
 - నిపుల్ హెయిర్ పోవాలంటే..
 - మొటిమల సమస్యకు.. కలబంద!
 - చర్మం ముడతలు పడుతోందా?
 - అందం... అలంకరణ రెండూనూ!
 
ఆరోగ్యమస్తు
- చక్కగా నిద్ర పట్టాలంటే..!
 - పది నిమిషాలు ఇలా చేస్తే.. ఫిట్‌గా మారిపోవచ్చుట!
 - ‘మఖానా’.. పోషకాల ఖజానా!
 - అభయ ముద్ర
 - తింటున్నా... నీరసమే!
 
అనుబంధం
- పిల్లల ముందు ఇలా చేయకూడదట!
 - ఆ రెండింటి సమన్వయానికీ..!
 - బంధం ప్రమాదకరంగా మారుతోందా..?
 - మీరు ‘మైండ్‌ఫుల్’ తల్లిదండ్రులేనా..!
 - అవసరానికి వాడుకుని వదిలేస్తున్నారా?
 
యూత్ కార్నర్
- హ్యాట్సాఫ్... అమ్మాయిలూ
 - Shafali Verma: అందుకే అప్పుడు అబ్బాయిలా వేషం మార్చుకున్నా..!
 - జెన్ జీ అమ్మాయిలు మరచిపోతున్నారా..!
 - మీరే ఒక సైన్యం!
 - 22ఏళ్ల అమ్మాయి... 100 మందికి అమ్మయ్యింది!
 
'స్వీట్' హోం
- చిమ్నీలు వాడుతున్నారా?
 - ఒత్తిడిని తగ్గించే ఫిష్ ట్యాంక్లివి..!
 - వెన్నతో.. ఇలా కూడా!
 - ఉసిరి దీపానికి స్టాండ్!
 - అందాల ఆలమండా!
 
వర్క్ & లైఫ్
- బాగా పని చేయాలంటే..!
 - అమ్మాయిలూ... ధైర్యమే మీ పెట్టుబడి!
 - అపరాధ భావంతో బాధపడుతున్నారా?
 - పొగిడితే ఆనందం!
 - బ్లూమ్ స్క్రోలింగ్ చేద్దామా..!
 































            








