Menopause: ఎర్లీ మెనోపాజ్‌.. ఏం తినాలి?

నాకు నలభై ఏళ్లు. నెలసరిలో తేడాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నా. హార్మోన్ల అసమతుల్యత, ఎర్లీ మెనోపాజ్‌ దశ అన్నారు. జీవనశైలిలో, తీసుకునే ఆహారంలో మార్పులు అవసరం అన్నారు.

Published : 06 Apr 2023 00:19 IST

నాకు నలభై ఏళ్లు. నెలసరిలో తేడాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నా. హార్మోన్ల అసమతుల్యత, ఎర్లీ మెనోపాజ్‌ దశ అన్నారు. జీవనశైలిలో, తీసుకునే ఆహారంలో మార్పులు అవసరం అన్నారు. నేను ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలియజేయండి?

- ఓ సోదరి

కొంతమందిలో హార్మోన్ల ప్రభావం వల్ల ఎర్లీ మెనోపాజ్‌ దశ వస్తుంది. దీని గురించి ఎక్కువగా భయపడాల్సిన పని లేదు. ఈ సమయంలో నిస్సత్తువ, కళ్లు తిరగటం వంటివి ఉంటాయి. ఈ వయసులో హార్మోన్లలో ఈస్ట్రోజెన్‌ శాతం తగ్గి టెస్టోస్టిరాన్‌ శాతం పెరుగుతుంది. దీంతో జీవక్రియల్లో సమస్యలు వస్తాయి. థైరాయిడ్‌, మధుమేహం వచ్చే అవకాశాలున్నాయి. బరువు పెరగటమే కాకుండా శరీరంలో కొలెస్ట్రాల్‌ స్థాయులు కూడా పెరుగుతాయి. ముందుగా మీరు బీఎంపీ పరీక్ష చేసుకోవాలి. అంటే మీ ఎత్తుకు తగ్గట్టు ఎంత బరువు ఉండాలో చెప్తారు. దానికి అనుకూలంగా బరువు తగ్గేలా ప్రణాళిక వేసుకోండి. పాలిష్‌ చేసినవి కాకుండా దంపుడు బియ్యం తీసుకోండి. మూడు పూటలా అన్నానికి బదులుగా ఒక పూట తృణధాన్యాలతో చేసిన రాగిజావ, జొన్నజావ లాంటివి తీసుకోండి. పొట్టుతో ఉన్న శనగలు, అలసందలు, పెసలు ఉడకబెట్టి లేదా మొలకలుగా తీసుకోవాలి. విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉండే తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తినాలి. రోజువారీ ఆహారంలో భాగంగా 30 గ్రాముల నట్స్‌ తీసుకోండి. పప్పు నూనెలు.. అదికూడా రోజుకు 5 నుంచి 6 చెంచాలు మాత్రమే వాడేలా చూసుకోండి. బరువును పెంచే మైదా, ప్రాసెసింగ్‌ ఫుడ్స్‌, ఐస్‌క్రీములు, చాక్లెట్లు, జంక్‌ఫుడ్‌ తగ్గించాలి. బరువు అదుపులో ఉంటే హార్మోన్ల అసమతుల్యతనూ అదుపులో ఉంచొచ్చు. తరచూ హిమోగ్లోబిన్‌ పరీక్ష చేయించుకొని దానికి తగ్గట్టుగా ఐరన్‌ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్