Kitchen: ఎక్కువ కాలం మన్నేలా...

ఓ పక్క ఆఫీసుకు లేటవుతూ ఉంటుంది.. కూరగాయలు తరుగుతుంటే చాకేమో మాట వినదు. హడావుడిగా ఏ కూరగాయలో ఫ్రై చేస్తూ ఉంటే బాండీకి అంటుకొని విసిగిస్తుంటాయి.

Updated : 20 May 2023 05:25 IST

ఓ పక్క ఆఫీసుకు లేటవుతూ ఉంటుంది.. కూరగాయలు తరుగుతుంటే చాకేమో మాట వినదు. హడావుడిగా ఏ కూరగాయలో ఫ్రై చేస్తూ ఉంటే బాండీకి అంటుకొని విసిగిస్తుంటాయి. ఇలా కాకుండా అసలు కిచెన్‌లో ఉండే వస్తువుల వాడకం గురించి తెలుసుకుందామా..

* ఇనుము, నాన్‌స్టిక్‌ బాణలిలను తోమే ముందు వాటికి ఏమైనా అంటుకొని ఉంటే నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. అలాకాకుండా వాటిని స్టీలు, గట్టి స్క్రబ్బర్లతో రుద్దితే వాటిపై ఉండే పొర పోతుంది. దానివల్ల కూరలు బాణలికి అంటుకుంటాయి. వాటిని సున్నితమైన స్పాంజ్‌లతో మాత్రమే శుభ్రం చేసుకోవాలి. కూరలు కలిపేందుకు స్టీలు గరిటెలు ఉపయోగిస్తే బాణలిలో గీతలు పడి పొర దెబ్బతింటుంది. అలాగే అవి తడి ఆరిపోయేంత వరకూ కప్‌బోర్డ్‌లో భద్రపరచకూడదు. లేదంటే తుప్పులాగా వస్తుంది. కాబట్టి తుడిచి పూర్తిగా ఆరనివ్వాలి.

* కూరగాయలు కోసేందుకు సాధారణంగా చాపింగ్‌ బోర్డులను ఉపయోగిస్తాం. వీటిల్లో ప్లాస్టిక్‌ వైతే చాకు పదును పోతుంది. దాంతో కూరగాయలు కోయడానికి ఇబ్బంది. ప్లాస్టిక్‌కు బదులుగా చెక్క రకాలు ఉపయోగించాలి. చాకుల పదును అలాగే ఉంటుంది. పని తేలిక, ఆరోగ్యం కూడా.

* చెక్క గరిటెలను డిష్‌వాషర్‌తోనూ, అంట్లుతోమే సబ్బులతోనూ శుభ్రం చేయకూడదు. అలా చేయటం వల్ల వాటిపైనున్న సున్నితమైన పొర తొలగి, పొడి బారి తొందరగా పాడవుతాయి. కాబట్టి చెక్క చాపింగ్‌ బోర్డులు, గరిటెల్ని వేడి నీళ్లలో కొద్దిగా లిక్విడ్‌ సోప్‌ వేసి కడగాలి. తర్వాత తడి దానంతట అదే ఆరుతుంది వదిలేయక కొద్దిగా శ్రద్ధ పెట్టి తుడిచి ఆరబెట్టుకుంటే ఎక్కువ కాలం మన్నుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్