Health news: జుట్టు రాలుతోందా!

వయసుతో సంబంధం లేకుండా జుట్టు రాలే సమస్య అందరిలోనూ కనిపిస్తుంటుంది. పోషకాహారలేమి, కాలుష్యం వంటివి అనేకం ఇందుకు కారణం కావొచ్చు.

Published : 27 May 2023 00:03 IST

వయసుతో సంబంధం లేకుండా జుట్టు రాలే సమస్య అందరిలోనూ కనిపిస్తుంటుంది. పోషకాహారలేమి, కాలుష్యం వంటివి అనేకం ఇందుకు కారణం కావొచ్చు. వీటితో పాటు పోషణ లోపించినప్పుడూ ఈ పరిస్థితి ఎదురవుతుంది. ఈ ఇబ్బందులకు చెక్‌పెడితే వెంట్రుకలు నిగనిగలాడటం ఖాయం. అందుకోసమే ఈ చిట్కాలు.

* గుడ్డులోని తెల్లసొనకు ఒక చెంచా ఆలివ్‌ నూనె కలిపి గిలకొట్టాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్ల నుంచి చివర్ల వరకూ రాసి అరగంట ఆరనివ్వాలి. ఆపై చల్లటి నీటితో తలస్నానం చేస్తే సరి. పీచులా ఉన్న జుట్టు కాస్తా మృదువుగా మారుతుంది.

* పావుకప్పు ఉల్లి రసాన్ని తలకు పట్టించి అరగంట ఆరనివ్వాలి. ఆపై గాఢత తక్కువ ఉండే షాంపూ వాడి తలస్నానం చేయాలి. ఇలా పదిహేను రోజులకోసారి చేస్తే జుట్టుకి పోషణ అందుతుంది. ఆరోగ్యంగా మారుతుంది.

* జుట్టు ఎక్కువగా రాలుతోందా? కప్పు కొబ్బరిపాలల్లో చెంచా తేనె కలిపి తలకు రాయాలి. ఆపై అరగంటాగి జుట్టుకి ఆవిరి పట్టి తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల ఇందులోని పోషకాలు జుట్టుని మెరిపిస్తాయి. సమస్యను అరికడతాయి.

* గుప్పెడు కరివేపాకుని లీటరు నీళ్లలో వేసి మరగనివ్వాలి. తర్వాత వీటిని చల్లార్చి కాస్త నిమ్మరసం, తేనె కలిపి మాడు నుంచి చివర్ల వరకూ రాయాలి. అరగంటాగి తలస్నానం చేస్తే సరి. వెంట్రుకలు చిట్లడం, జుట్టు పొడిబారడం వంటి సమస్యలు దరిచేరవు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్