Health: పొడి బారిన కళ్లతో ఇబ్బందా...

ఆఫీసులో ఎక్కువగా కంప్యూటర్‌ని చూస్తూ కూర్చోటం వల్లనో.. ఫోన్‌ను గంటల తరబడి చూడటం వల్లనో కళ్లు పొడిబారుతుంటాయి. మంట, దురదలు వస్తుంటాయి. దూరం చేసుకోవడానికి కొన్ని ఇంటి చిట్కాలు ఇస్తున్నారు నిపుణులు. అవేంటో చూద్దామా..

Published : 21 May 2023 01:22 IST

ఆఫీసులో ఎక్కువగా కంప్యూటర్‌ని చూస్తూ కూర్చోటం వల్లనో.. ఫోన్‌ను గంటల తరబడి చూడటం వల్లనో కళ్లు పొడిబారుతుంటాయి. మంట, దురదలు వస్తుంటాయి. దూరం చేసుకోవడానికి కొన్ని ఇంటి చిట్కాలు ఇస్తున్నారు నిపుణులు. అవేంటో చూద్దామా..

* గోరు వెచ్చని నీళ్లలో కాటన్‌ వస్త్రం ఉంచి, నీళ్లను పిండి.. కళ్లపై అయిదు నిమిషాలు ఉంచాలి. ఆపై కనురెప్పలపై మృదువుగా రుద్దాలిలి. దీంతో కళ్లలో ఉండే దుమ్ము అంతా ఒక పక్కకి వచ్చేస్తుంది. వస్త్రం చల్లబడే వరకూ ఇలాచేస్తే.. మంట, దురదల నుంచి ఉపశమనం లభిస్తుంది.

* కొబ్బరి నూనెలో దూదిని ముంచి, కనురెప్పలపై 15 నిమిషాలు ఉంచాలి. తర్వాత చల్లటి నీళ్లతో తడిపిన వస్త్రంతో తుడవాలి. ప్రతి 3-4 గంటలకోసారి ఇలా చేస్తే.. మంటలు తగ్గుతాయి.

* చిన్న కలబంద ముక్కని తీసుకొని.. పొట్టు తీసి దానితో కనురెప్పలపై సున్నితంగా రుద్దాలి. పదినిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. దీనిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కళ్ల అలసటను తగ్గించడమే కాదు.. నొప్పి, వాపు తగ్గించి, తాజాగా ఉంచుతుంది. కొన్నిరోజులు ఇలా రోజుకు రెండు సార్లు చేయాలి.

* విటమిన్‌ ఏ లోపం వల్ల కళ్లు పొడిబారతాయి. రోజ్‌వాటర్‌లో ఇది పుష్కలంగా ఉంటుంది. కొద్దిగా దూది తీసుకొని రోజ్‌వాటర్‌తో తడపాలిలి. దాంతో కనురెప్పలపై మృదువుగా తుడవాలి. పదినిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో శుభ్రం చేయాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్