ఇలా చేస్తే నిద్ర పట్టేస్తుంది..!
మాతృత్వం ఎంత మధురమైనదే అయినా ఈ సమయంలో కొన్ని సమస్యలూ తప్పవు. నెలలు నిండుతున్న కొద్దీ నిద్ర పట్టకపోవడం కూడా వీటిలో ఒకటి....
మాతృత్వం ఎంత మధురమైనదే అయినా ఈ సమయంలో కొన్ని సమస్యలూ తప్పవు. నెలలు నిండుతున్న కొద్దీ నిద్ర పట్టకపోవడం కూడా వీటిలో ఒకటి. అయితే జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడడం అంత కష్టం కాదంటున్నారు నిపుణులు. మరి అవేంటో చూద్దాం రండి.
సాయంత్రం లోపే..
ఈ సమయంలో ఎదురయ్యే ముఖ్యమైన సమస్యల్లో ఒకటి రాత్రి పూట ఎక్కువగా బాత్రూంకి వెళ్లాల్సి రావడం. అందువల్ల మధ్యాహ్నం నుంచి సాయంత్రం లోపే ఎక్కువ మొత్తంలో నీళ్లు తాగేయాలి. సాయంత్రం నుంచి రాత్రి వరకు కాస్త తక్కువ నీళ్లు తీసుకున్నా సరిపోతుంది. దీనివల్ల రాత్రి పూట మధ్యలో పదేపదే మెలకువ రాకుండా ఉంటుంది.
వ్యాయామం చేయండి..
ప్రెగ్నెన్సీ సమయంలో ఏ పనీ చేయకుండా పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలనుకుంటారు కొంతమంది. అయితే అది కరెక్ట్ కాదు.. డాక్టర్లు ప్రత్యేకంగా సూచిస్తే తప్ప పూర్తి విశ్రాంతి పనికి రాదు. తేలిక పాటి వ్యాయామం మీకూ, కడుపులోని బిడ్డకూ కూడా చాలా మంచిది. దీనివల్ల మీరు రోజంతా ఉత్సాహంగా ఉండగలుగుతారు. రాత్రి కూడా హాయిగా నిద్రపోగలుగుతారు. అయితే పడుకోవడానికి నాలుగైదు గంటల ముందు నుంచి ఎక్సర్సైజ్ చేయకపోవడం మంచిది. రోజూ వ్యాయామం చేసే సమయాన్ని కూడా గమనిస్తూ ఉండాలి. మరీ ఎక్కువసేపు చేయకూడదు. ఎలాంటి వ్యాయామాలు మంచివన్న విషయంలో వైద్యులను, సంబంధిత నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి.
ఆందోళన వదిలేయండి..
ఒత్తిడి, ఆందోళన.. రాత్రి నిద్ర పాడు చేసే కారణాల్లో ప్రధానమైనవి. ఇంట్లో, ఆఫీసులో సమస్యలు, డెలివరీ గురించి ఉండే భయాలు ఇలాంటివేవైనా కావచ్చు. వాటి గురించి ఎక్కువగా ఆలోచించి ఒత్తిడికి గురై నిద్ర పోకపోవడం మీ బిడ్డ మెదడుపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. అందుకే ఆందోళన పడటం మానేయండి.
టైం సెట్ చేసుకోండి!
రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం అలవాటు చేసుకోవడం వల్ల నిద్ర పట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే పడుకునే ముందు టీవీ చూడటం, సెల్‌ఫోన్, కంప్యూటర్ వంటివి ఉపయోగించటం చేయకూడదు. కనీసం పడుకునే సమయానికి అరగంట ముందే ఇవన్నీ ఆపేయాలి. అలాగే గోరువెచ్చని నీటితో స్నానం చేయడం, వెచ్చటి పాలు తాగడం వంటి వాటి వల్ల కూడా చక్కటి ఫలితాలుంటాయి. సుఖంగా నిద్రపడుతుంది.
మసాజ్ మంచిదే..!
పడుకోవడానికి కనీసం గంట ముందు తలను, కాళ్లను సున్నితంగా మసాజ్ చేయించుకుంటే నరాలు ఉత్తేజితమవుతాయి. దీనివల్ల నిద్ర బాగా పడుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- Makeup: ఈ పొరపాట్లు వద్దు!
- మ్యాచింగ్ పోట్లీ మస్తుంది!
- అందానికి చింతపండు..!
- నిర్మలమ్మ ‘బడ్జెట్’ శారీస్.. చీరచీరకో ప్రత్యేకత!
- చినుకుల్లో కురులు జాగ్రత్త!
ఆరోగ్యమస్తు
- ఎత్తును బట్టే..!
- Nayanthara : నచ్చిందే తింటా.. నోరు కట్టేసుకోను!
- ‘అమ్మా’ అనే పిలుపు వినాలని!
- మీ మౌత్‌వాష్ ఎలాంటిది?
- చాందీపుర వైరస్.. పిల్లల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
అనుబంధం
- కొలీగ్‌తో రెండో పెళ్లి.. పేరెంట్స్ వద్దంటున్నారు!
- ‘777’ నియమంతో... బంధం బలోపేతం!
- పిల్లలకు ఎలాంటి పుస్తకం కొంటున్నారు..?
- వాళ్ల ప్రేమ నిజమా? నకిలీనా?
- Sushmita Sen: లైంగిక అంశాల గురించి నా పిల్లలతో అలా చర్చిస్తా!
యూత్ కార్నర్
- పాపులారిటీ కోసం ప్రాణాలెందుకు రిస్క్‌లో పెడతారు?!
- తెలుగమ్మాయి... బ్రిటన్‌లో మెరిసింది!
- వాళ్లున్నప్పుడు మారిపోతాడు!
- రెండేళ్ల కష్టం... రూ.54 లక్షల ఉద్యోగం!
- మలార్ వాట్సాప్... టీచర్!
'స్వీట్' హోం
- వర్షాలకు మొక్కలు పాడవకుండా..!
- మొక్కలకు కాఫీ పొడి వేస్తున్నారా?
- తగిలిస్తే... పిల్లి వచ్చే!
- నూరు వరహాలతో నిండుగా
- వ్యాపారమా... ఉద్యోగమా?
వర్క్ & లైఫ్
- Flower Truck Business: అందమైన పూల బొకేలతో.. లక్షలు సంపాదిస్తూ..!
- బరువెక్కుతున్న తెలుగు రాష్ట్రాలు!
- ఈ అలవాట్లే మనల్ని ధనవంతుల్ని చేస్తాయట!
- కేర్ టేకర్లు... కోట్లలో కావలెను!
- ఆఫీసులో ఒత్తిడి తగ్గుతుందిలా..