పసిదాన్ని వదిలి వెళుతున్నా..

మాతృత్వ సెలవులు పూర్తి చేసుకొని ఈమధ్యే తిరిగి ఉద్యోగంలో చేరా. ఆఫీసులో ఉంటే పాప ధ్యాస. పాప పక్కనున్నా పని విషయాలే ఆలోచిస్తున్నా. పసిదాన్ని వదిలి ఉద్యోగానికి వెళుతున్నానన్న అపరాధ భావన పెరిగిపోతోంది. దీన్నుంచి బయటపడేదెలా?

Updated : 01 Feb 2023 03:58 IST

మాతృత్వ సెలవులు పూర్తి చేసుకొని ఈమధ్యే తిరిగి ఉద్యోగంలో చేరా. ఆఫీసులో ఉంటే పాప ధ్యాస. పాప పక్కనున్నా పని విషయాలే ఆలోచిస్తున్నా. పసిదాన్ని వదిలి ఉద్యోగానికి వెళుతున్నానన్న అపరాధ భావన పెరిగిపోతోంది. దీన్నుంచి బయటపడేదెలా?

- నవ్య, హైదరాబాద్‌

కెరియర్‌ను ఇష్టపడే మహిళలు ఎదుర్కొనే సమస్యే ఇది! పిల్లలను అలా వదిలేయకూడదు, వదిలేస్తే నలుగురూ ఏమనుకుంటారోనని ఆలోచిస్తుంటారు. కానీ జీవనశైలిలో కొద్ది మార్పులు చేసుకుంటే రెండింటి సమన్వయం సాధ్యమే. ఇంటికొచ్చాక మొబైల్‌ని సైలెంట్‌లో పెట్టండి. వీలుంటే స్విచాఫ్‌ చేయండి. గడిపేది అరగంటే అయినా మీ దృష్టంతా చిన్నారి మీదే ఉంచేలా చూసుకోండి. మీ ప్రేమ వారికి అర్థమవుతుంది. ఆఫీసులో ఉంటే పనిమీదే ధ్యాస ఉండాలి. అప్పుడు ఇలాంటి అపరాధ భావనలుండవు. ఉద్యోగం చేస్తున్న అమ్మలతో స్నేహం చేయండి. వాళ్లూ ఇలాంటి స్థితిని ఎదుర్కొంటూ ఉంటారు. ఒకరికొకరు ఉత్సాహపరుచుకుంటూ సాయంగా నిలవొచ్చు. మీ పాపాయి కంటే పెద్ద వయసు పిల్లలున్న వాళ్లతో మాట్లాడితే వాళ్ల అనుభవం నుంచి బోలెడు విషయాలు నేర్చుకోవచ్చు. ఆడవాళ్లు సహజంగానే చిన్న పొరపాటుకే ఇబ్బంది పడిపోతుంటారు. ఎవరికోసమో తక్కువ చేసుకోవడం, దాన్నుంచి బయటపడటానికి కారణాలు వెతుక్కోవడం వద్దు. మీకోసం మీరూ కొంత సమయం కేటాయించుకోండి. మీకేది ముఖ్యమో మీరే నిర్ణయించుకోవాలి. రోజువారీ చేయాల్సిన వాటిని రెండు, మూడు దశలుగా విభజించుకోండి. పనీ సులువవుతుంది. ముఖ్యంగా మీరు సూపర్‌ విమెన్‌ కాదన్న విషయాన్ని గమనించుకోండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్